Health Tips: రోజూ గుడ్డు తింటే ఏమవుతుందో తెలుసా.. డాక్టర్స్ చెప్పేది ఏంటంటే..
- గుడ్డుతో ఆరోగ్యం మెండు..
- బోలెడు ఉపయోగాలు ఉంటాయంటున్న వైద్యులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రోజూ గుడ్డు తినడం ఆరోగ్యానికి మంచిదా కాదా అనే చర్చ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా గుడ్డులోని పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరిగి గుండె జబ్బులు వస్తాయని చాలామంది భయపడుతుంటారు. అయితే.. ఈ అనుమానాలపై ఎయిమ్స్ వైద్య నిపుణులు స్పష్టతనిస్తున్నారు. వరుసగా రెండు వారాల పాటు ప్రతిరోజూ ఒక గుడ్డును ఆహారంలో భాగం చేసుకుంటే శరీరంలో అద్భుతమైన మార్పులు వస్తాయని వారు విశ్లేషిస్తున్నారు. గుడ్డును ఒక సంపూర్ణ ఆహారంగా పరిగణించడానికి ప్రధాన కారణం అందులో ఉండే పోషకాల సమతుల్యత.
మెదడు పనితీరు మెరుగుపడటంలో గుడ్డు కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో ఉండే ‘కోలిన్’ అనే పోషకం నాడీ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఇది జ్ఞాపకశక్తిని పెంచడమే కాకుండా.. పనిపై ఏకాగ్రతను కుదురుస్తుంది. మెదడు కణాల మధ్య సమాచార మార్పిడి వేగంగా జరగడానికి ఇది ఇంధనంలా పనిచేస్తుంది. ఇక కొలెస్ట్రాల్ విషయానికి వస్తే.. గుడ్డు తినడం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుందనేది ఒక అపోహ మాత్రమేనని వైద్యులు చెబుతున్నారు. వాస్తవానికి గుడ్డులోని పచ్చసొన శరీరానికి మేలు చేసే హెచ్‌డీఎల్ (HDL) అనే మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. ఇది గుండె ధమనులలో పూడికలు ఏర్పడకుండా రక్షణ కవచంలా పనిచేస్తుంది.
Also Read
కంటి చూపు మందగించకుండా ఉండటానికి గుడ్డులోని ల్యూటిన్, జీక్సాంథిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఎంతో అవసరం. ప్రస్తుత డిజిటల్ యుగంలో మొబైల్, కంప్యూటర్ స్క్రీన్ల నుంచి వచ్చే హానికరమైన నీలి కాంతి ప్రభావం కళ్లపై పడకుండా ఇవి అడ్డుకుంటాయి. వయసు రీత్యా వచ్చే చూపు సమస్యలను కూడా ఇవి నివారిస్తాయి. కేవలం అంతర్గత ఆరోగ్యమే కాకుండా, బాహ్య సౌందర్యానికి కూడా గుడ్డు మేలు చేస్తుంది. ఇందులో ఉండే అమైనో ఆమ్లాలు శరీరంలో కెరాటిన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి. దీనివల్ల జుట్టు రాలడం తగ్గి, చర్మం కాంతివంతంగా మారుతుంది. గోళ్లు చిట్లకుండా దృఢంగా పెరుగుతాయి.
చాలామంది తెల్లసొన మాత్రమే తిని పచ్చసొనను పక్కన పడేస్తారు. కానీ విటమిన్ ఏ, ఈ, డీ, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు వంటి ముఖ్యమైన పోషకాలన్నీ పచ్చసొనలోనే నిక్షిప్తమై ఉంటాయి. మన శరీరంలో హార్మోన్ల సమతుల్యతకు, కణాల పునర్నిర్మాణానికి పచ్చసొనలోని కొవ్వులు ఎంతో అవసరం. ఒకవేళ ఎవరైనా శాకాహారులు లేదా గుడ్లు పడని వారు ఉంటే, వారు ప్రోటీన్ కోసం సోయా పనీర్ లేదా సోయా గింజలను ప్రత్యామ్నాయంగా తీసుకోవచ్చు. మొత్తానికి ఆరోగ్యవంతులు రోజుకో గుడ్డును నిరభ్యంతరంగా తీసుకోవచ్చని.. అది శారీరక, మానసిక దృఢత్వానికి తోడ్పడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
SA VS AUS: 10 ఏళ్ల కష్టానికి ఫలితం.. పాయింట్స్ టేబుల్ టాప్‌లోకి దూసుకెళ్లిన దక్షిణాఫ్రికా..
-
Srikaanth Odela: విభజన నేపథ్యంతో కొత్త లవ్ స్టోరీ.. శ్రీకాంత్ ఓదెల నయా ప్లాన్!
-
Scene Trailer: సైకో కిల్లర్‌తో మాజీ కాప్ ఆట.. సూర్య ‘సీన్’ ట్రైలర్ చూశారా?
-
Arjuna: పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు పాన్-ఇండియా మూవీ.. టైటిల్ ఇదేనట?
-
Hyderabad Traffic Police : డ్రైవింగ్ చేస్తూ సెల్‌ఫోన్ వాడిన 3600 మంది పట్టుకున్న పోలీసులు..
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!