ఇండియాలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. తాజాగా ఇండియాలో 25,166 కేసులు నమోదవ్వగా, 437 మంది కరోనాతో మృతి చెందినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నది. దాదాపు 5 నెలల తరువాత 25 వేల కేసులు నమోదవ్వడం విశేషం. ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3.22 కోట్లకి చేరింది. తాజాగా కరోనా నుంచి 36,830 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. భారత్‌లో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 3.14 కోట్లకు చేరింది. ఇకపోతే, ఇప్పటి వరకు ఇండియాలో కరోనాతో 4,32,079 మంది మరణించినట్టు గణాంకాలు చెబుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో 88,13,919 మందికి టీకాలు వేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొన్నది.