ఇండియాలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈరోజు భారీ స్థాయిలో కేసులు తగ్గాయి. ఇండియలో తాజాగా 30,549 కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్లో పేర్కొన్నది. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,17,26,507కి చేరింది. ఇందులో 3,08,96,354 మంది ఇప్పటికే కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 422 మంది మృతి చెందారు. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు కరోనాతో 4,25,195 మంది మృతి చెందారు. ఇకపోతే, గడిచిన 24 గంటల్లో 38,887 మంది కోలుకొని డిశ్చార్జ్ అయినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తెలియజేసింది. దేశంలో 24 గంటల్లో 61,09,587 మందికి టీకాలు అందించారు. దీంతో మొత్తం ఇప్పటి వరకు దేశంలో 47,85,44,114 మందికి టీకాలు వేశారు.