ఇండియాలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. నిన్నటి రోజున 30 వేలకు పడిపోయిన కేసులు ఈరోజు తిరిగి 40 వేలకు పైగా నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో ఇండియాలో 42,625 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,17,69,132కి చేరింది. ఇందులో 3,09,33,022 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక, 4,10,353 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో 36,668 మంది కోలుకొని డిశ్చార్జ్ అయినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఇక, 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 562 మంది మృతి చెందారు. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,25,757కి చేరింది. 24 గంటల్లో ఇండియాలో 62,53,741 మందికి వ్యాక్సిన్ అందించారు. దీంత ఇప్పటి వరకు మొత్తం 48,52,86,570 మందికి టీకాలు వేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొన్నది.