Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
- పెళ్లి ప్రతిపాదన తిరస్కరించిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి.
- ఛత్తీస్‌గఢ్ బాలోద్ జిల్లాలో దారుణ సంఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో దారుణం చోటుచేసుకుంది. పెళ్లి ప్రతిపాదన తిరస్కరించిందనే కారణంతో 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి జరిగిందని పోలీసులు తెలిపారు. బాలోడ్ జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు 20 ఏళ్ల యువకుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు యశ్ కుమార్ సోంకర్, కరుణ్ కుంజామ్గా గుర్తించారు. కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అవుతున్న బాధితురాలు లైబ్రరీలో చదువుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ దాడి జరిగింది.
గాయాలపాలైన బాధితురాలని బాలోద్ జిల్లా ఆస్పత్రికి తరలించగా, ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం రాయ్‌పూర్ తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. సోంకర్ బాధితురాలిని పెళ్లి చేసుకోవాలని కోరగా, అందుకు ఆమె నిరాకరించినట్లు బాలోద్ ఎస్పీ కిరణ్ చవాన్ తెలిపారు. ఇదే కాకుండా ఆమె వేరే వ్యక్తితో మాట్లాడుతోందనే అనుమానాన్ని సోంకర్ పెంచుకున్నట్లు పోలీసులు తెలిపారు. తన స్కూల్ ఫ్రెండ్ కరణ్ కుంజామ్తో కలిసి దాడికి ప్లాన్ చేసినట్లు వెల్లడించారు.
Also Read
- Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
- Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
- Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
నిందితులు దాడికి ఉపయోగించిన యాసిడ్‌ను దుర్గ్ జిల్లా నుంచి వారం రోజుల ముందు కొనుగోలు చేశారు. దాడికి 3 నెలల నుంచి ప్లాన్ చేసినట్లు విచారణలో తేలింది. సెప్టెంబర్ 27న యాసిడ్ కొనుగోలు చేసిన నిందితులు, గణేష్ ఊరేగింపు సమయంలో దాడి చేయాలని తొలుత భావించారు. కానీ భారీ భద్రతా ఏర్పాట్ల కారణంగా ప్లాన్‌ను విరమించుకున్నట్లు తేలింది. లైబ్రరీ నుంచి ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో దాడి చేశారు. సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాలతో నిందితుల్ని గుర్తించారు.
తాజావార్తలు
-
Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
-
Indian Air Force: కొత్త ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా ఆశుతోష్ దీక్షిత్ నియామకం.. అక్టోబర్ 31న బాధ్యతలు
-
Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. ‘దొంగ నా కొడుకు’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
WI Vs IND: వెస్టిండీస్‌తో మొదటి టీ20 మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!