BrahMos Deal: ప్రపంచంలోనే అతిపెద్ద ముస్లిం దేశమైన ఇండోనేషియా భారత బ్రహ్మోస్ క్షిపణిని కొనుగోలు చేయడానికి సిద్ధమవుతోంది. నిజానికి భారతదేశం – ఇండోనేషియా మధ్య ఈ చారిత్రాత్మక రక్షణ ఒప్పందం చివరి దశలో ఉంది. ఇండోనేషియా త్వరలో భారతదేశంలో అత్యంత ప్రాణాంతకమైన సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్‌ను కొనుగోలు చేస్తుందని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. నిజానికి ఈ వార్త పొరుగున ఉన్న పాకిస్థాన్‌కు కచ్చితంగా ఆగ్రహం తెప్పిస్తుంది. READ ALSO: సేఫ్టీలో సంచలనం సృష్టించిన Honda Amaze..…
BrahMos missile: బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి కొనుగోలుకు సంబంధించి భారత్-ఇండోనేషియా మధ్య ప్రధాన రక్షణ ఒప్పందాలను ఖరారు చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. రష్యా నుంచి తుది ఆమోదం కోసం వేచి ఉన్నట్లు రక్షణ శాఖ వర్గాలు చెబుతున్నాయి. రెండు దేశాల మధ్య వివిధ స్థాయిల్లో చర్చలు జరిగాయి.
India Pakistan: ఎట్టకేలకు పాకిస్తాన్ క్రమంగా నిజాలను ఒప్పుకుంటోంది. తమపై భారత్ దాడి చేయలేదని, దాడి జరిగినా, పాకిస్తాన్ ఆర్మీ తిప్పికొట్టింది అంటూ విజయోత్సవాలు చేసుకున్న ఆ దేశ నేతలు నిజాలను వెల్లడిస్తున్నారు. తాజాగా, తమపై భారత్ క్షిపణులతో దాడులు చేసిందని, పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ అన్నారు. మే 10 తెల్లవారుజామున భారత్ బాలిస్టిక్ క్షిపణులతో నూర్ ఖాన్ ఎయిర్‌బేస్‌తో పాటు ఇతర ఎయిర్ బేస్‌లపై దాడులు చేసిందిన ఆయన బహిరంగంగా ప్రకటించారు.
BrahMos: పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ పేరుతో పాకిస్తాన్‌లోని పలు ఉగ్రవాద స్థావరాలపై భీకర దాడులు చేసింది. ఈ దాడిలో జైషే మహ్మద్, లష్కరే తోయిబా ప్రధాన కార్యాలయాలతో పాటు వాటి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. 100కు పైగా ఉగ్రవాదుల్ని హతమార్చింది.