BrahMos: ఆపరేషన్ సిందూర్‌లో భారతీయ ఆయుధాలకు ప్రపంచ వ్యాప్తంగా ఎనలేని క్రేజ్ వచ్చింది. చైనీస్ మిస్సైల్స్, టర్కీష్ డ్రోన్లను స్వదేశీ తయారీ ఆయుధాలతో మట్టికరిపంచారు. దీంతో పాటు బ్రహ్మోస్ క్షిపణులు ఈ ఆపరేషన్‌లో చాలా సమర్థంతంగా పనిచేసినట్లు తేలింది.
BrahMos: పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ పేరుతో పాకిస్తాన్‌లోని పలు ఉగ్రవాద స్థావరాలపై భీకర దాడులు చేసింది. ఈ దాడిలో జైషే మహ్మద్, లష్కరే తోయిబా ప్రధాన కార్యాలయాలతో పాటు వాటి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. 100కు పైగా ఉగ్రవాదుల్ని హతమార్చింది.