Mahesh Babu: వారణాసి తర్వాత మహేశ్ నటించే సినిమా ఏంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానుల కళ్లన్నీ ఇప్పుడు ‘వారణాసి’ పైనే ఉన్నాయి. దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాతో మహేష్ బాబు ‘పాన్ వరల్డ్’ స్టార్‌గా తన గ్లోబల్ జర్నీని మొదలుపెట్టబోతున్నారు. అయితే, ఈ భారీ ప్రాజెక్ట్ సెట్స్‌పై ఉండగానే, మహేష్ తదుపరి సినిమా ఎవరితో ఉండబోతోంది? అనే చర్చ సోషల్ మీడియాలో జోరందుకుంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం, ‘వారణాసి’ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఈ ఏడాది ఆగస్ట్ నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాను 2027, ఏప్రిల్ 7న అత్యంత ప్రతిష్టాత్మకంగా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ‘గుంటూరు కారం’ తర్వాత దాదాపు మూడేళ్ల గ్యాప్ తీసుకుని వారణాసి వస్తుండటంతో, ఈసారి గ్యాప్ లేకుండా మరో సినిమాను లైన్‌లో పెట్టాలని మహేష్ భావిస్తున్నారట.
Also Read:Dhurandhar 2: తెలుగు వెర్షన్ కోసం ఎదురు చూసేవారికి గుడ్ న్యూస్
Also Read
- Prabhas: మళ్ళీ ప్రభాస్‌తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
- Maruthi: మళ్ళీ హోం గ్రౌండ్‌కి డైరెక్టర్ మారుతి?
- Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
- DC on Onemore OTT : మరో ఓటీటీలోకి కనగరాజ్ గ్యాంగ్‌స్టర్ హిట్ ‘DC’.. ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?
వారణాసితో గ్లోబల్ ఇమేజ్ రాబోతుండటంతో, మహేష్ బాబు తన నెక్స్ట్ మూవీని కూడా అదే స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. సందీప్ వంగా మేకింగ్ స్టైల్ హాలీవుడ్ ప్రమాణాలకు తగ్గట్టుగా ఉంటుంది. మహేష్ లాంటి క్లాస్ అండ్ మాస్ హీరోను సందీప్ తనదైన రా-స్టైల్‌లో చూపిస్తే బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయమని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. ప్రస్తుతం ప్రభాస్‌తో ‘స్పిరిట్’, ఆ తర్వాత ‘యానిమల్ పార్క్’ (సీక్వెల్) ప్రాజెక్టులతో సందీప్ బిజీగా ఉన్నారు. మరి మహేష్ కోసం ఆయన ఎప్పుడు టైం కేటాయిస్తారు అనేది సస్పెన్స్‌గా మారింది. రాజమౌళి సినిమా తర్వాత మహేష్ మార్కెట్ అమాంతం పెరిగిపోతుంది. కాబట్టి ఆయన తర్వాతి ప్రాజెక్ట్ కేవలం తెలుగుకో లేదా ఇండియాకో పరిమితం కాకుండా, గ్లోబల్ ఆడియన్స్‌ను మెప్పించేలా ఉండాలని మహేష్ పట్టుదలతో ఉన్నారు. వారణాసి పూర్తయ్యేలోపు మహేష్ ఏ డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు? మళ్ళీ ఏదైనా ప్రయోగాత్మక చిత్రంతో వస్తారా? అన్నది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్.
తాజావార్తలు
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
-
Hyderabad: ఉప్పల్‌లో మ్యాచ్‌కు ముందు సంచలనం.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు అరెస్ట్..!
-
21st Century Best Bowler: 21వ శతాబ్దపు టాప్-10 బౌలర్లు.. టాప్ లేపిన ఆసీస్ దిగ్గజం.. బుమ్రా స్థానం ఎక్కడో తెలుసా?
-
Sushila Devi Inspirational Story: 63 ఏళ్ల వయసులో పదో తరగతి పాసైన బామ్మ.. 79.6 శాతం మార్కులతో అదరగొట్టిందిగా..
ట్రెండింగ్
-
Sound Glow ఫీచర్‌తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
-
Temba Bavuma: కెప్టెన్‌గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!