Smriti Irani defamation case on Illegal Bar allegations: కాంగ్రెస్ నేతలు ఇటీవల కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూతురుపై తీవ్ర ఆరోపణలు చేశారు. గోవాలో అక్రమంగా బార్ నిర్వహిస్తున్నాంటూ విమర్శించారు. దీనికి ప్రతిగా ప్రధాని మోదీ స్మృతి ఇరానీని తన పదవి నుంచి భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. అయితే ఈ ఆరోపణలపై స్మృతి ఇరానీ ఢిల్లీ హైకోర్టులో పరువు నష్టం దావా వేశారు. తాజాగా ఈ కేసుపై విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేతలు జైరాం రమేష్, పవన్ ఖేరా, నెట్టా డిసౌజాకు శుక్రవారం సమన్లు జారీ చేసింది.
స్మృతి ఇరానీ, ఆమె కూతురుపై చేసిన ఆరోపణలకు సంబంధించి సోషల్ మీడియాలో చేసిన ట్వీట్లు, రీట్వీట్లు, పోస్టులు, వీడియోలు, ఫోటోలను 24 గంటల్లో తొలగించాలని జస్టిస్ మినీ పుష్కర్ణ ఆదేశాలు జారీ చేశారు. ఇచ్చిన గడువులోగా.. ముగ్గురు కాంగ్రెస్ నేతలు తమ ఆదేశాలను పాటించకపోతే.. ట్విట్టర్, యూట్యూబ్లు వీటన్నింటిని తొలగిస్తాయని ఆదేశాలు జారీ చేసింది. తన కూతురుపై నిరాధారణ ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేతలపై రూ.2 కోట్లకు పరవు నష్టం దావా దాఖలు చేశారు. ఇదిలా ఉంటే స్మృతి ఇరానీ దాఖలు చేసిన వ్యాజ్యంపై సమాధానం చెప్పాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో జైరాం రమేష్ కోర్టు ముందు వాస్తవాలు, సాక్ష్యాలు ఉంచేందుకు ఎదురుచూస్తున్నామంటూ ట్వీట్ చేశారు.
స్మృతి ఇరానీ కుమార్తె జోయిష్ ఇరానీ గోవాలో అక్రమంగా బార్ నడుపుతోందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. అయితే.. ఈ వ్యాఖ్యలపైస్మృతి ఇరానీ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ నేతలను కోర్టుకు ఈడుస్తానని.. ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కుమారుడు రాహుల్ గాంధీని అమేథీలో ఓడించినందుకే కాంగ్రెస్ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని..2024లో కూడా రాహుల్ గాంధీని ఓడిస్తానని సవాల్ విసిరారు. 18 ఏళ్ల నా కూతురు వ్యక్తిత్వాన్ని కాంగ్రెస్ మర్డర్ చేసిందంటూ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.