జమ్మూ కాశ్మీర్‌లోని సోనామార్గ్‌లో సోమవారం జెడ్-మోర్ టన్నెల్‌ను ప్రధాని మోడీ ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్ నేడు అభివృద్ధిలో కొత్త కథను రాస్తోందన్నారు. ఇంతకుముందు క్లిష్టమైన పరిస్థితులు ఉండేవన్నారు. ఇప్పుడు మన కాశ్మీర్ భూమిపై స్వర్గంగా గుర్తింపు పొందుతోందని ప్రధాని తెలిపారు.
Sushilkumar Shinde: మాజీ కేంద్ర హోం మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత సుశీల్ కుమార్ షిండే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. కాంగ్రెస్ హాయాంలో 2012లో షిండే కేంద్ర హోం మంత్రిగా ఉన్న సమయంలో తన శ్రీనగర్ పర్యటనను గుర్తు చేసుకున్నారు. మంగళవారం, ఆయన మాట్లాడుతూ.. జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లోని లాల్ చౌక్‌ని సందర్శించినప్పుడు తానను భయపడ్డానని వెల్లడించారు.