India-Pak Ceasefire: పహల్గామ్లో ఉగ్రవాద దాడి తర్వాత భారత ప్రజల్లో మరోసారి పాకిస్తాన్ పై తీవ్ర ఆగ్రహంతో ఉగిపోయింది. ఆపరేషన్ సింధూర్ తో అది కొంత శాంతించింది. కానీ, భారత్ పాక్ యుద్ధానికి శనివారం సాయంత్రం కాల్పుల విరమణ ఒప్పందంతో ఫుల్ స్టాప్ పడింది. దీంతో నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో దేశ ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్తో గతంలోనూ ఎన్నో సార్లు కాల్పుల విరమణ ఒప్పందాలు చేసుకున్నారు.. కానీ, అవి ఎంతో కాలం పని చేయలేదు.. కొద్ది రోజులకే పాక్ మళ్లీ కాల్పులకు దిగిందని పేర్కొంటున్నారు. ఇక, సరిహద్దుల్లో గస్తీ కాసే భారత సైనికుల మీద కాల్పులు, గ్రెనేడ్ దాడులు, ఉగ్రవాదులకు సపోర్టు ఇచ్చే పాక్ తో శాంతి ఒప్పందం చేసుకోవడంపై భారత ప్రజలు వ్యతిరేకిస్తున్నారు.
Read Also: India Pakistan war dictionary: భారత్-పాక్ యుద్ధం వేళ.. ఈ పదాలకు అర్థం ఏంటో తెలుసా?
అయితే, ప్రతీసారి మనం సంయమనం పాటించినప్పటికీ.. పాకిస్తాన్ మాత్రం ఉగ్రవాద ధోరణిని మార్చుకోవడం లేదని సోషల్ మీడియాలో నెటిజన్స్ రాసుకొస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో కాల్పుల విరమణకే పరిమితమైపోతుందా అన్న అనుమానం నెలకొంది. దేశ భద్రతకు ప్రమాదం ఏర్పడే పరిస్థితుల్లో ప్రభుత్వాలే కాదు, ప్రజలు కూడా నిశ్శబ్దంగా ఉండలేరని నెట్టింట పోస్టులు పెడుతున్నారు. సైనికులను, వారి ప్రాణాలని అత్యంత విలువైనవిగా భావించే ప్రజలు పాక్కి గట్టి బుద్ధి చెప్పాలనే డిమాండ్ చేస్తున్నారని పేర్కొన్నారు.
Read Also: Operation Sindoor: అధికారిక లాంఛనాలతో.. నేడు వీర జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు
ఇక, దేశ ప్రజలకు శాంతి కావాలి కానీ, అది వాస్తవంగా అమలులోకి రావాలని కోరుకుంటున్నారు అని సామాజిక మధ్యమాల్లో నెటిజన్స్ పెట్టిన పోస్టుల్లో రాసుకొచ్చారు. మాటల శాంతి కాకుండా, ఆచరణలో కనిపించే శాంతి కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రెండు దేశాలు సుధీర్ఘ చర్చలతో సమస్యలకు పరిష్కారం కనుగొనాలని సూచిస్తున్నారు.
America and Trump 😭 pic.twitter.com/PSdueY5Kze
— Kunal (@kxone8) May 10, 2025
🔴🔴🔴 A request to our PM 🙏🏻🙏🏻
– మన దేశ హిందువులని టెర్రరిస్టులు కాల్చి చంపారు..!
– మన దేశపు జవాన్లని, మన దేశ సాధారణ పౌరులని పాకిస్తాన్ సైన్యం చంపేసింది..!
– మీరు సీజ్ ఫైర్ ఒప్పందం చేసుకున్న తరువాత కూడా శత్రు సైన్యం మన దేవాలయాల పైన దాడి చేస్తున్నారు, మన BSF అధికారిని… pic.twitter.com/CT397LbT3u— Ravi Teja (@Brs_Teja) May 10, 2025