Moonlighting: రెండు ఉద్యోగాలు చేస్తున్న 300 మందిని విప్రో ఎలా గుర్తించిందో తెలుసా..? వైరల్ అవుతున్న స్టోరీ ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
How Did Wipro Catch 300 “Moonlighters”: వర్క్ ఫ్రం హోం అదనుగా పలువురు ఐటీ జాబ్స్ చేస్తున్న వారికి వార్నింగ్ ఇచ్చాయి టెక్ దిగ్గజ కంపెనీలు విప్రో, ఐబీఎం, ఇన్ఫోసిస్. ఇకపై తమ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులు ‘మూన్ లైటింగ్’ విధానంలోొ రెండు జాబ్స్ చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపాయి. మూన్ లైటింగ్ చేస్తున్నారని తెలిస్తే.. వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తామని విప్రో బాస్ రిషద్ ప్రేమ్ జీ హెచ్చరించారు. ఇక మిగతా ఐటీ కంపెనీలు కూడా తమ ఉద్యోగులు రెండు జాబ్స్ చేసినట్లు తెలిస్తే తొలగించే పనిలో ఉన్నాయి.
తాజాగా విప్రో కంపెనీ 300 మంది ఉద్యోగులను తీసేసింది. తమ సంస్థలో పనిచేస్తూ ఇతర కంపెనీలకు కూడా వర్క్ చేస్తున్నారని తెలిసి వీరందరిపై చర్యలు తీసుకుంది. అయితే ఈ 300 వందల మందిని విప్రో ఎలా గుర్తించిందనేదే అంతుబట్టని విషయం. ప్రస్తుతం వర్క్ ఫ్రం హోం చేస్తున్న ఉద్యోగుల్లో చాలా మంది ఆఫీసుకు వెళ్లేందుకు ఆసక్తి చూపించడం లేదు. పైగా.. కంపెనీలనే బ్లాక్ మెయిల్ చేస్తున్నారనే అపవాదు ఉంది. ఇంట్లో రెండు వేర్వేరు ల్యాప్‌టాప్‌లు పెట్టుకుని రెండు వేర్వేరు కంపెనీలకు పనిచేస్తున్న ఉద్యోగులను విప్రో ఎలా గుర్తించిందనేదే ఇక్కడ పెద్ద ప్రశ్న.
Also Read
- CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
- CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
- Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
- UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
Read Also: Mulayam Singh Yadav: ముగిసిన ములాయం సింగ్ అంత్యక్రియలు.. హాజరైన తెలంగాణ సీఎం కేసీఆర్
అయితే వీరిందరిని ఇలా గుర్తించి ఉండవచ్చని తెలుస్తోంది. దీనిపై రాజీవ్ మోహతా అనే వ్యక్తి అక్టోబర్ 10న ట్వీట్ చేశారు. దీనికి ఇప్పటికే 10,000 వేలకుపైగా రిప్లేలు వచ్చాయి. ప్రతీ కంపెనీ కూడా ఉద్యోగి ‘‘ప్రావిడెంట్ ఫండ్ కంట్రిబ్యూషన్’’ ద్వారా వీరందరిని గుర్తించారని పేర్కొన్నారు. ప్రతీ కంపెనీ కూడా తమ ఉద్యోగి పేరుతో పీఎఫ్ డబ్బును క్రమం తప్పకుండా జమ చేయాలని, దానిని ఉల్లంఘించడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుంది. ఉద్యోగి జీతం నుంచి కొంత మొత్తాన్ని ప్రతీ నెల పీఎఫ్ కింద జమ చేస్తారు.
అయితే పీఎఫ్ అకౌంట్ ఓపెనింగ్ సమయంలో వ్యక్తి సంబంధించిన ఆధార్, పాన్ నెంబర్, బ్యాంకు అకౌంట్ మొదలైనవి తీసుకుంటారు. వీటన్నింటిని పీఎఫ్ ఖాతాతో అనుసందిస్తుంటారు. అయితే మూన్ లైటింగ్ చేస్తున్నవారికి రెండు కంపెనీలకు చెందిన రెండు పీఎఫ్ అకౌంట్లను క్రియేట్ చేయడంతో విషయం బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రతీ రోజూ పీఎఫ్ అధికారులు ‘‘డి-డూప్లికేట్ అల్గారిథమ్’’ ద్వారా రెండు ఖాతాలు ఉన్న ఉద్యోగులను గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతోనే విప్రో మూన్ లైటింగ్ చేస్తున్న వారిని గుర్తించినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని పీఎఫ్ అధికారులు ధృవీకరించలేదు.
300 #Wipro employees sacked as they took advantage of work from home and worked parallely with another company.
How #Digital #India has precisely found the culprits is amazing. Kindly read the below article. Fantastic system in place in India.
— Rajiv Mehta (@rajivmehta19) October 10, 2022
తాజావార్తలు
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
-
Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
-
CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
-
Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!