Ayodhya Event: రామ మందిర వేడుక వేళ రూల్స్ ఉల్లంఘించారో AI పట్టేస్తుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ayodhya Event: అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి కొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి. జనవరి 22న ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా అయోధ్యలో భవ్య రామమందిరం ప్రారంభం కాబోతోంది. శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట వేడుకకు ప్రధానితో పాటు దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లోని 7000 మంది ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో యూపీ సర్కార్ అన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేసింది.
భద్రతా ఉల్లంఘనలపై ఇప్పటికే హోం మంత్రిత్వ శాఖ రాష్ట్రాన్ని అప్రమత్తం చేసింది. తాజా బెదిరింపుల నేపథ్యంలో ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు దాదాపు 12,000 మంది సిబ్బందిని అయోధ్య చుట్టుపక్కల ప్రాంతాల్లో మోహరించింది. అయితే నేరస్తుల ఆటకట్టించేందుకు పోలీసులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ని కూడా ఉపయోగిస్తున్నారు.
Also Read
- NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
- Kerala: "ఇక కేరళలో చట్టాలను నిర్ణయించేది మేమే".. ఊరేగింపులో రెచ్చిపోయిన ముస్లిం లీగ్ నేతలు..
- Work From Home: కేంద్రం కంపెనీలకు "వర్క్ ఫ్రమ్ హోమ్" ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
- Indian Railways logo: ఇండియన్ రైల్వేస్ లోగోలో భారీ మార్పు.. ఇకపై 18 నక్షత్రాలు..ఈ మార్పుకు కారణం ఏమిటి?
Read Also: Khalistan: ప్రభుత్వ పాఠశాల గోడపై “ఖలిస్తానీ” అనుకూల రాతలు.. దర్యాప్తు ప్రారంభం..
ప్రాణప్రతిష్ట వేడుక ముందు సైబర్ ముప్పును ఎదుర్కొనేందుకు కేంద్ర హోం శాఖ అయోధ్యకు ఉన్నతస్థాయి సైబర్ నిపుణుల బృందాన్ని పంపింది. అయోధ్య భద్రతను పర్యవేక్షించేందుకు ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేయడం చేశారు. ఇక్కడ నుంచే వివిధ భద్రతా ఏజెన్సీలు రియల్‌టైంలో సెక్యూరిటీని పర్యవేక్షిస్తాయి.
ముఖ్యంగా అనుమానిత కార్యకలాపాలను గుర్తించేందుకు, నేరస్తులు, దుర్మార్గులను గుర్తించేందుకు భద్రతా ఏజెన్సీలు తొలిసారిగా AI నిఘా వ్యవస్థలను ఉపయోగిస్తున్నారు. అయోధ్య చుట్టుపక్కల 10,000 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటిలో సుమారుగా ఎల్లోజోన్ పరిధిలో ఉన్నాయి. ఎల్లో జోన్లో మొదటిసారిగా ఫేషియల్ రికగ్నిషన్ కోసం AIని ఉపయోగిస్తున్నామని యూపీ పోలీస్ లా అండ్ ఆర్డర్ డైరెక్టర్ జనరల్ ప్రశాంత్ కుమార్ అన్నారు. నేరస్తులను గుర్తించడంలో, సరిపోల్చడంలో సాయం చేయడానికి ఏఐకి ఉత్తర్ ప్రదేశ్ క్రిమినల్ డేటా బేస్ పోర్టల్‌ని అప్లోడ్ చేశారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన AI- ఆధారిత CCTV నిఘా వ్యవస్థ వ్యక్తులు లేదా ఏదైనా సమూహాలు అసాధారణంగా ప్రవర్తించడాన్ని గుర్తించేందుకు సాయపడుతుంది.
తాజావార్తలు
-
Jailer 2 : ‘జైలర్ 2’ సెట్లో విషాదం.. విద్యుత్ షాక్‌తో యువ కార్మికుడు మృతి!
-
Tilak Varma Gesture: రోహిత్ కోసం తిలక్ వర్మ ’45’ స్పెషల్ గెస్టర్.. వీడియో వైరల్
-
Gold and Silver Rates: భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు.. నేడు తులం ఎంతంటే?
-
Sharwanand : ‘జార్జ్ కృష్ణ’ కోసం మిస్ ఇండియా.. వైట్ల హిట్ ఇస్తాడా?
-
Hyderabad: పక్కా ప్లాన్‌తో దోపిడీలు.. హైదరాబాద్ పోలీసులకు తలనొప్పిగా మారిన నేపాలీ గ్యాంగ్‌లు..
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!