అయోధ్య రామ మందిరంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట రోజు (సోమవారం) ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో కీలక నిర్ణయం తీసుకుంది. నిన్న ( జనవరి 22న) పలు ఉత్తరాది రాష్ట్రాల్లో నాన్‌వెజ్ డెలివరీలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ప్రకటించింది.
Nithyananda: అయోధ్య రామ మందిర వేడుకకు సంబంధించి తనకు ఆహ్వానం అందిందని వివాదాస్పద గురువు నిత్యానంద వెల్లడించారు. తాను ఈ కార్యక్రమానికి హాజరవుతానని ప్రకటించారు. తనను తాను స్వయంప్రకటిత దేవుడిగా ప్రకటించుకున్న నిత్యానంద, పరారీలో ఉన్న అత్యాచార నిందితుడు. ఈ విషయాన్ని ఆయన తన ఎక్స్‌లో పేర్కొన్నారు. తనకు తాను కౌలాస దేశాన్ని సృష్టించుకుని, హిందూ మతానికి సుప్రీంగా చెప్పుకుంటున్నాడు.
Ayodhya Event: అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి కొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి. జనవరి 22న ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా అయోధ్యలో భవ్య రామమందిరం ప్రారంభం కాబోతోంది. శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట వేడుకకు ప్రధానితో పాటు దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లోని 7000 మంది ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో యూపీ సర్కార్ అన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేసింది.
Ram Temple Event: రామ మందిర ప్రారంభోత్సవాన్ని చూసేందుకు యావత్ దేశం సిద్ధమైంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంది. ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా జనవరి 22న శ్రీరాముడి విగ్రహ ‘ప్రాణ ప్రతిష్ట’ కార్యక్రమం జరగబోతోంది.
జనవరి 22న జరగనున్న అయోధ్యలోని రామమందిర శంకుస్థాపన కార్యక్రమానికి సోనియా గాంధీ హాజరయ్యే అవకాశం ఉందని, త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటారని కాంగ్రెస్ వర్గాలు శుక్రవారం తెలిపాయి.