MP Arvind: జిల్లాలో ఉగ్రవాద చర్యలను అరికట్టాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. లా అండ్ ఆర్డర్ సరిగా పనిచేయడం లేదని ఆరోపించారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ పాలనలో సమాజానికి ముప్పు ఉందని విమర్శలు గుప్పించారు. హిందు పండగలపై ఆంక్షలు పెడుతున్నారని.. వినాయక నిమజ్జన వేడుకల్లో హిందూ యువకులపై అక్రమ కేసులు పెట్టారన్నారు. ముస్లిం యువకులు ర్యాలీలు చేసినా పట్టించుకోవడం లేదన్నారు.. సిమీ పీఎఫ్ ఐ కార్యకలాపాలకు అడ్డగా మారింది.. హిందూ అమ్మాయిలను…
SIMI Terrorist: నిషేధిత స్టూడెంట్స్ ఇస్లామిక్ మూమెంట్ ఆఫ్ ఇండియా(సిమి) ఉగ్రవాది హనీఫ్ షేక్ పోలీసులకు చిక్కాడు. 22 ఏళ్లుగా పరారీలో ఉన్న ఇతడిని ఢిల్లీ పోలీసుల ప్రత్యేక సెల్ ఫిబ్రవరి 22న అరెస్ట్ చేసింది. కేవలం ఒకే ఒక క్లూ అయిన అతని మారుపేరు సాయంతో భయంకరమైన ఉగ్రవాదిని పోలీసులు పట్టుకున్నారు. ఇతడికి హనీఫ్ షేక్, మహ్మద్ హనీఫ్ మరియు హనీఫ్ హుదాయి పేర్లు ఉన్నాయి. 2002లో పరారీలో ఉన్న నేరస్తుడిగా ప్రకటించారు.
ఉగ్రవాద సంస్థ స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా(SIMI)పై భారత ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. హోం మంత్రిత్వ శాఖ ఈ రోజు (జనవరి 29) ఈ సంస్థను కఠినమైన ఉగ్రవాద నిరోధక చట్టం ప్రకారం దానిపై నిషేధాన్ని మరో ఐదేళ్లపాటు 'చట్టవిరుద్ధమైన సంఘం'గా ప్రకటించింది.
కేంద్ర ప్రభుత్వం తనపై విధించిన ఐదేళ్ల నిషేధాన్ని చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) ట్రిబ్యునల్ ధృవీకరించడాన్ని వ్యతిరేకిస్తూ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ) సుప్రీంకోర్టును ఆశ్రయించింది.