Hospital Fire: ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం.. 10 మంది మృతి
- ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం
- 10 మంది మృతి
- 20 మందికి పైగా రోగులకు గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గురువారం తెల్లవారుజామున బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లోని ఓ ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు పది మంది రోగులు మరణించినట్లు అధికారులు తెలిపారు. రక్షించిన పలువురు రోగుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ముజఫర్‌పూర్‌లోని బ్రహ్మపురలో ఉన్న ప్రసాద్ ఆసుపత్రిలో తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించి , ఆసుపత్రి ప్రాంగణమంతటా భయాందోళనలు నెలకొన్నాయి. ఐదవ అంతస్తులోని ఐసీయూ వార్డులో ఈ మంటలు చెలరేగాయి. విషపూరిత పొగ వేగంగా ఆసుపత్రి మొత్తాన్ని కమ్మేసింది.
ప్రాథమిక సమాచారం ప్రకారం, షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. ఈ ఘటనలో 20 మందికి పైగా రోగులు గాయపడగా, వారిని సురక్షితంగా తరలించారు. తెల్లవారుజామున 3 గంటలకు మంటలు చెలరేగగా, ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే, దాదాపు డజను అగ్నిమాపక వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. అగ్నిమాపక బృందం మంటలను ఆర్పేసి రోగులను బయటకు సురక్షితంగా తరలించాయి.
Also Read
- Rajesh Rawani Success Story: డ్రైవర్ తండ్రిని కోటీశ్వరుడిని చేసిన కొడుకు ఐడియా.. రాజేష్ రావణి సక్సెస్ స్టోరీ
- iPhone Langar: ఐఫోన్ కొనలేకపోతున్నారా..? ఉచితంగా పొందే అవకాశం మిస్ కావొద్దు..!
- School Midday Meal: సర్కార్ బడుల్లో చికెన్ బిర్యానీ.. సీఎం డ్రీమ్ ప్రాజెక్ట్‌పై మంత్రి కీలక ప్రకటన
- IIT Bombay Student:పరీక్షలో ChatGPT వాడుతూ పట్టుబడ్డ IIT బాంబే విద్యార్థి ఆ*త్మహ*త్య.. క్యాంపస్‌లో నిరసనలు
10 మంది మృతి
ఈ ఘటనను వివరిస్తూ అగ్నిమాపక అధికారి ఆర్.ఎన్. పాండే మాట్లాడుతూ, “తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఆసుపత్రిలో అగ్నిప్రమాదం గురించి మాకు కాల్ వచ్చింది. మా బృందం అక్కడికి చేరుకునేసరికి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఐసీయూ వార్డు మొత్తం దట్టమైన నల్లటి పొగతో నిండిపోయింది” అని అన్నారు. 20 మందికి పైగా రోగులను సురక్షితంగా రక్షించడం ఊరట కలిగించే విషయమని, అయితే 10 మంది మరణించినట్లు నివేదికలు వచ్చాయని అధికారి తెలిపారు.
ఆసుపత్రి సిబ్బంది పారిపోయారని ఆరోపణలు
ఈ ఘటన అనంతరం ఆసుపత్రి యాజమాన్యంపై ప్రజాగ్రహం వెల్లువెత్తింది. ఘటనా స్థలంలో ఉన్న రోగుల బంధువులు, ఆసుపత్రి యాజమాన్యం బాధ్యత లేకుండా ప్రవర్తించిందని ఆరోపించారు. బాధితుల్లో ఒకరు ఏడుస్తూ, తన తండ్రి ఐసీయూలో చేరారని, ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారని వివరించారు. ఘటన జరిగిన తర్వాత, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది అందరూ రోగులను వదిలి అక్కడి నుంచి పారిపోయారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
తాజావార్తలు
-
Shivam Dube: ధోనీ vs రోహిత్.. ఇద్దరిలో ఎవరు బెస్ట్ టీ20 కెప్టెన్.. దూబేకు పెద్ద సమస్యే వచ్చిందే!
-
Wine: చిన్న పెగ్ తాగినా రిస్కేనా? అమ్మాయిలు తప్పకుండా తెలుసుకోవాల్సిన మ్యాటర్ ఇది!
-
Rajesh Rawani Success Story: డ్రైవర్ తండ్రిని కోటీశ్వరుడిని చేసిన కొడుకు ఐడియా.. రాజేష్ రావణి సక్సెస్ స్టోరీ
-
Gold and Silver Price Today: బంగారం, వెండి ధరలకు మళ్లీ రెక్కలు.. రెండో రోజూ భారీ పెరుగుదల
-
Sonu Sood: కొత్త ఐఫోన్ కోసం క్యూలో జనం.. యూజర్స్ కి సోనూ సూద్ చురకలు
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!