యూట్యూబర్‌తో సన్నిహిత సంబంధాలు.. ఐజీపై సస్పెన్షన్ వేటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ ఐపీఎస్ అధికారిపై వేటు వేసింది కేరళ ప్రభుత్వం… కేరళ కేడర్‌కు ఐపీఎస్ అధికారి అయిన లక్ష్మణ్ నాయక్‌ను సస్పెండ్ చేశారు సీఎం విజయన్.. నకిలీ పురాతన కళాఖండాలను విక్రయించిన కేసులో నిందితుడిగా ఉన్న యూట్యూబర్ మోన్సన్ మవున్‌కల్‌తో లక్ష్మణ్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తేలడంతో.. కేరళ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.. గతంలోనూ లక్ష్మణ్ నాయక్‌పై పలు ఆరోపణలు ఉన్నాయని చెబుతున్నారు పోలీసులు.
ఇక, 1997 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి అయిన లక్ష్మణ్ నాయక్ స్వస్థలం ఖమ్మం జిల్లా.. ప్రస్తుతం ఐజీ కేడర్‌లో సీఎంకు చీఫ్ సెక్యూరిటీగా ఉన్నారు లక్ష్మణ్ నాయక్.. యూట్యూబర్ మోన్సన్ మవున్‌కల్‌తో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయంటూ కేరళ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. మోసపూరిత కార్యకలాపాలలో మోన్సన్‌కు సహాయం చేయడానికి తన పదవిని ఉపయోగించారనే ఆరోపణలపై హోం శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, పురాతన వస్తువుల వ్యాపారిగా మాయమాటలు చెప్పి ప్రజల నుండి కోట్లాది రూపాయలను మోసం చేసినందుకు మోన్సన్ సెప్టెంబర్‌లో అరెస్ట్ కాగా.. మోన్సన్ మవున్‌కల్‌కి కేరళ మాజీ పోలీసు చీఫ్ డీజీపీ లోక్‌నాథ్ బెహెరా, ప్రస్తుత రాష్ట్ర పోలీస్ చీఫ్ డీజీపీ అనిల్‌కాంత్‌తో సహా రాష్ట్రంలోని అనేక మంది పోలీస్ ఉన్నతాధికారులతో సంబంధం ఉన్నట్లు కొన్ని ఆధారాలు వెలుగుచూశాయి.. దీంతో లక్ష్మణ్‌పై చర్యలకు డీజీపీ కార్యాలయం సిఫారసు చేయడంతో.. చర్యలకు పూనుకుంది ప్రభుత్వం.
Also Read
- Delhi: ఘోర అగ్నిప్రమాదం.. రెస్టారెంట్లో మంటలు.! 21 మంది మృతి, పలువురికి గాయాలు.!
- DK Shivakumar: కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్.. నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రుల లిస్ట్ ఇదే.!
- DK Shivakumar: నేడు సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం.. దేవాలయాల్లో పూజలు, వీవీఐపీలకు ప్రత్యేక ఆహ్వానాలు!
- WMO Warning: ప్రమాదకర ఎల్‌నినో రాబోతుంది.. ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరిక
తాజావార్తలు
-
LPG dealerships: గ్యాస్ ఏజెన్సీ ఆఫర్.. ఈ తరహా మెసేజీలు వస్తున్నాయా? ప్రభుత్వం ఏం చెబుతుందంటే..?
-
Fake IPS Officer: నకిలీ ఐపీఎస్ ముఠా గుట్టురట్టు.. సూడో పోలీస్ వ్యవస్థ ఏర్పాటు చేసి కిడ్నాప్‌లు, వసూళ్లు!
-
PEDDI Hikes : పెద్ది తెలంగాణ టికెట్ ధరల పెంపు.. జీవో వెనుక చక్రం తిప్పిన టాలీవుడ్ బడా నిర్మాత
-
Tamballapalle MLA: చావడానికైనా, చంపడానికైనా సిద్ధం.. తంబళ్లపల్లె ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు!
-
Tim David: నీకు ఫైన్ వేయడంలో ఏమాత్రం తప్పు లేదయ్యా.. గ్రౌండ్ లోనే సిగార్ తాగుతూ రచ్చ రచ్చ.!
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్‌తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!