Giriraj Singh: ‘‘హిందువులు ఎప్పుడూ సెలవులను డిమాండ్ చేయరు’’.. నమాజ్ బ్రేక్ రద్దుపై కేంద్రమంత్రి..
- నమాజ్ బ్రేక్ ఎత్తేసిన అస్సాం ప్రభుత్వంపై కేంద్రమంత్రి ప్రశంసలు..
- అందరికి ఒకేలా చట్టాలు ఉండాలన్న గిరిరాజ్ సింగ్..
- హిందువులు ఎప్పుడూ సెలవుల్ని డిమాండ్ చేయరు..
- ఇండియా కూటమి అధికారంలోకి వస్తే దేశం మరో పాకిస్తాన్- బంగ్లాదేశ్ అవుతుంది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Giriraj Singh: బ్రిటీష్ కాలం నుంచి అమలులో ఉన్న అస్సాం అసెంబ్లీలోని రెండు గంటల నమాజ్ విరామాన్ని హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వం ఎత్తేసింది. ఈ నిర్ణయాన్ని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ శనివారం ప్రశంసించారు. మతం ఆధారంగా ప్రాధాన్యత ఇవ్వకూడదని అననారు. ఈ చర్య తీసుకున్న అస్సాం సీఎం, అసెంబ్లీ స్పీకర్, ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. చట్టంలో ఏకరూపత కలిగి ఉండటం చాలా అవసరం మరియు ఏ మత సమాజానికి ప్రాధాన్యత ఇవ్వకూడదని ఆయన బీహార్ బెగుసరాయ్‌లో మాట్లాడారు.
Read Also: Maharashtra: సోదరిని ముక్కలు ముక్కలుగా నరికి నదిలో పడేసిన తమ్ముడు..
Also Read
హిందుత్వవాదిగా పేరున్న గిరిరాజ్ సింగ్, అస్సాం ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న ఇండియా కూటమి నేతలపై ఫైర్ అయ్యారు. ప్రతిపక్షాలు ఇదే విధంగా ఏదో రోజు భారత్‌ని పాకిస్తాన్, బంగ్లాదేశ్‌గా మారుస్తారని అన్నారు. రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్, తేజస్వి యాదవ్ వంటి నాయకులు ముస్లిం ఓటు బ్యాంకుకు ఛాంపియన్లని ఎద్దేవా చేశారు. వారు తమ మార్గంలోనే ఉంటే ప్రతీ శుక్రవారం దేశవ్యాప్తంగా సెలవు ఇచ్చేవారని దుయ్యబట్టారు.
హిందువులు వారంలో చాలా రోజులను పవిత్రంగా జరుపుకుంటారని, కానీ ఎప్పుడూ సెలవు కోరుకోరని గిరిరాజ్ సింగ్ అన్నారు. హిందువులు శివుడిని పూజించే సోమవారం, హనుమంతుడిని పూజించే మంగళవారం సెలవుల్ని కోరుకోరని చెప్పారు. ప్రతిపక్ష ఇండియా కూటమి అధికారంలోకి వస్తే దేశాన్ని పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లా మారుస్తారని అన్నారు. అస్సాంలో 1937లో ముస్లిం లీగ్‌కి చెందిన సయ్యదు సాదుల్లా జుమ్మా సమయంలో 2 గంటల విరామాన్ని ప్రకటించారు. అప్పటి నుంచి కొనసాగుతున్న ఈ పద్ధతిని తొలగించారు.
తాజావార్తలు
-
Indian Cinema: ‘బాహుబలి 2’ను కూడా వెనక్కి నెట్టిన పాత సినిమా.. 12 కోట్లకు పైగా టికెట్లు అమ్మి సరికొత్త రికార్డ్!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Project Cheetah Success: భారత్‌లో పెరిగిన చీతాల సంఖ్య.. 56కి చేరిక.. పర్యావరణానికి ఎందుకు కీలకం?
-
El Nino: ధరల మోత మరోసారి మోగనుంది.. సామాన్యులను నిండా ముంచిన ఎల్‌నినో!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!
-
iPhone 18 Pro Max: ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఛార్జింగ్ టెస్ట్‌లో సంచలనం..
-
Jio యూజర్లకు అదిరిపోయే ఆఫర్.. ఏడాది పాటు Amazon Prime Lite ఫ్రీ.. ఎలా పొందాలంటే.?