IFFI అవార్డుకు నామినేట్ అయిన తొలి తెలుగు వెబ్ సిరీస్‌గా చరిత్ర సృష్టించిన ‘మయసభ’..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mayasabha In IFFI: తెలుగు డిజిటల్ ఎంటర్టైన్మెంట్ రంగంలో ‘మయసభ’ సరికొత్త చరిత్ర సృష్టించింది. సోనీలివ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ తెలుగు పొలిటికల్ డ్రామా 57వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI)లో ప్రతిష్ఠాత్మకమైన బెస్ట్ వెబ్ సిరీస్ (OTT) అవార్డుకు జాతీయ స్థాయిలో నామినేట్ అయింది. 2023లో ఈ అవార్డును ప్రవేశపెట్టినప్పటి నుంచి ఈ విభాగంలో నామినేషన్ దక్కించుకున్న తొలి తెలుగు వెబ్ సిరీస్‌గా ‘మయసభ’ నిలిచింది.
ప్రముఖ దర్శకుడు దేవా కట్టా ఆధ్వర్యంలో రూపొందిన ఈ సిరీస్‌కు దేవా కట్టా, కిరణ్ జయ్ కుమార్ దర్శకత్వం వహించారు. హిట్మెన్, ప్రూడోస్ ప్రొడక్షన్స్ ఎల్ఎల్పీ బ్యానర్లపై విజయ్ కృష్ణ లింగమనేని, శ్రీ హర్ష సంయుక్తంగా నిర్మించారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో స్నేహాలు, రాజకీయ సంబంధాలు, ప్రత్యర్థిత్వాలు, అధికార సమీకరణాలు కాలక్రమంలో ఎలా మారాయనే అంశాలను ఆసక్తికరమైన కథనంతో ఇందులో చూపించారు. ఆది పినిశెట్టి, చైతన్య రావు, సాయికుమార్, దివ్య దత్తా, నాజర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. విభిన్నమైన కథనం, నటీనటుల అద్భుతమైన ప్రదర్శన, ఉన్నత నిర్మాణ విలువలతో ‘మయసభ’ ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు జాతీయ స్థాయిలో అవార్డుకు నామినేట్ కావడంతో ఈ సిరీస్‌కు మరో ప్రత్యేక గుర్తింపు లభించింది.
Also Read
- 21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..
- AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికల సందడి.. తొలి విడతలో 1.18 లక్షల నామినేషన్లు.. పూర్తి లెక్కలివే..!
- Akvan Cyclone: తీవ్ర తుఫాన్‌గా బలపడిన అక్వాన్.. కోస్తాంధ్రకు గండం.. రేపు, ఎల్లుండి అత్యంత భారీ వర్షాలు
- AP Panchayat Elections: నగదు ఇచ్చుకో.. సర్పంచి పదవి పుచ్చుకో! రేణిగుంటలో రూ.1.5 కోట్ల డిమాండ్?
భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఓటీటీ రంగంలో నాణ్యమైన కంటెంట్‌ను ప్రోత్సహించేందుకు 2023లో జరిగిన 54వ ఐఎఫ్ఎఫ్ఐ వేడుకల్లో బెస్ట్ వెబ్ సిరీస్ (OTT) అవార్డును ప్రవేశపెట్టారు. గతంలో ‘పంచాయత్ సీజన్ 2’, ‘లంపన్’, ‘బందిష్ బాండిట్స్ సీజన్ 2’ వంటి వెబ్ సిరీస్‌లు ఈ పురస్కారాన్ని అందుకున్నాయి. దేశంలోని విభిన్న భాషల్లో రూపొందుతున్న ప్రతిభావంతమైన కథలకు ఈ అవార్డు గుర్తింపునిస్తోంది. 57వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకలు ఈ నెల 20 నుంచి 28 వరకు గోవాలో జరగనున్నాయి. బెస్ట్ వెబ్ సిరీస్ (OTT) అవార్డు విజేతకు రూ.10 లక్షల నగదు బహుమతితో పాటు ప్రశంసాపత్రాన్ని అందజేయనున్నారు. కథా రచన, కళాత్మక సృజన, సాంకేతిక నైపుణ్యాలను ప్రామాణికంగా తీసుకుని ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తారు.
తాజావార్తలు
-
IFFI అవార్డుకు నామినేట్ అయిన తొలి తెలుగు వెబ్ సిరీస్‌గా చరిత్ర సృష్టించిన ‘మయసభ’..!
-
RC17 Heroine: హీరోయిన్ రేసులో ఐదుగురు కుర్ర భామలు.. సుకుమార్ మనసులో ఎవరున్నారు?
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..
-
AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికల సందడి.. తొలి విడతలో 1.18 లక్షల నామినేషన్లు.. పూర్తి లెక్కలివే..!
-
VinFast VF 2: టాటా నానో కంటే చిన్న ఎలక్ట్రిక్ కారు.. VinFast కొత్త ఎలక్ట్రిక్ కారు.. 18.3kWh బ్యాటరీ, 210KM రేంజ్
ట్రెండింగ్
-
SRH-IPL 2027: హెడ్‌కు గుడ్‌బై.. మరో 8 మంది అవుట్.. ఎస్ఆర్హెచ్ రిటెన్షన్, రిలీజ్, పర్స్ డీటెయిల్స్ ఇవే!
-
MS Dhoni Drone Show: రెండు కళ్లు చాలవుగా చూడడానికి.. ధోనీ రెటైమెంట్తో ప్రత్యేక డ్రోన్ షో నిర్వహించిన సీఎస్కే..!
-
IPL 2027 Retentions: ధోనీ ఔట్.. ట్రావిస్ హెడ్, స్టార్క్‌కు షాక్.. 10 జట్ల రిటెన్షన్, రిలీజ్, పర్స్ డీటెయిల్స్ ఇవే!
-
200MP కెమెరా, AMOLED సెకండరీ డిస్ప్లే, 6,000mAh బ్యాటరీతో Xiaomi 18 Pro లాంచ్..!
-
200MP+200MP కెమెరాలు, IP66+IP68+IP69 రేటింగ్స్, 7,050mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ Xiaomi 18 Pro Max లాంచ్..!