RS 12 Crore Lottery Jackpot: గెలిపించిన నమ్మకం.. 15 ఏళ్ల నిరీక్షణకు ఫలితం.. ట్రక్ డ్రైవర్‌కు రూ.12 కోట్ల లాటరీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RS 12 Crore Lottery Jackpot: అదృష్టం ఎప్పుడు, ఎవరిని వరిస్తుందో చెప్పలేం. కొన్నిసార్లు ఎన్నో ఏళ్ల నిరీక్షణకు ఒక్కరోజులోనే ఫలితం దక్కుతుంది. పంజాబ్‌లో ఓ ట్రక్ డ్రైవర్ విషయంలో ఇదే జరిగింది. గత 15 ఏళ్లుగా ప్రతి పండుగకు లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తున్న ఓ వ్యక్తికి ఎట్టకేలకు భారీ జాక్‌పాట్ తగిలింది. ఏకంగా రూ.12 కోట్ల బంపర్ లాటరీని గెలుచుకుని రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. పంజాబ్‌లోని మొహాలీ జిల్లాకు చెందిన బల్జీందర్ సింగ్ అనే ట్రక్ డ్రైవర్ 2026 పంజాబ్ స్టేట్ డియర్ దీపావళి బంపర్ లాటరీలో మొదటి బహుమతిని గెలుచుకున్నాడు.
దీంతో ఆయన కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. గ్రామస్థులు సైతం ఆయన ఇంటికి చేరుకుని శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మొహాలీలోని డేరా బస్సీ ప్రాంతంలో ఉన్న హమాయున్పూర్ గ్రామానికి చెందిన బల్జీందర్ సింగ్ ట్రక్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గత 15 ఏళ్లకు పైగా ప్రతి పండుగ సమయంలో లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తున్నాడు. 2010 నుంచి క్రమం తప్పకుండా లాటరీ టికెట్లు కొంటున్నప్పటికీ ఇప్పటివరకు అదృష్టం వరించలేదు. అయినప్పటికీ ఆయన ఆశను వదులుకోలేదు. ఎప్పటికైనా లాటరీ తగులుతుందనే నమ్మకంతో టికెట్లు కొనుగోలు చేస్తూనే ఉన్నాడు. చివరకు ఆయన నిరీక్షణకు తెరపడింది. పంజాబ్ స్టేట్ డియర్ దీపావళి బంపర్ లాటరీలో మొదటి బహుమతిగా రూ.12 కోట్లు గెలుచుకున్నాడు.
Also Read
- Kulgam Gunfight: కుల్గాంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు.. లతీఫ్ భట్ కోసం వేట
- Congress: CJP ఉద్యమాన్ని కాంగ్రెస్ దెబ్బతీసింది.. రాహుల్‌పై మాజీ మిత్రపక్షం సంచలన విమర్శలు..!
- Viral Video: క్వాడ్ సమావేశంలో జాతీయ జెండాకు గౌరవం.. మోడీ చేసిన పని వైరల్..
- Cyclone Akvan: ఆంధ్రప్రదేశ్ వైపే వరస తుఫానులు.. బంగాళాఖాతంలో అసలేం జరుగుతోంది.?
బల్జీందర్ సింగ్‌కు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇన్నేళ్లుగా లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తున్న విషయాన్ని ఆయన తన కుటుంబ సభ్యులకు కూడా పెద్దగా చెప్పలేదట. లాటరీలో విజయం సాధించిన అనంతరం తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. 2010 నుంచి ప్రతి పండుగకు లాటరీ టికెట్లు కొంటున్నానని, ఒకరోజు దేవుడు తన ప్రార్థనలు ఆలకించి బహుమతి అందిస్తాడని ఎప్పుడూ నమ్మేవాడినని తెలిపాడు. ఇప్పుడు తన కల నిజమైందని, తాను ఎంతో అదృష్టవంతుడినని ఆనందం వ్యక్తం చేశాడు. బల్జీందర్ సింగ్‌కు రూ.12 కోట్ల లాటరీ తగిలిందన్న వార్త తెలియగానే ఆయన స్వగ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. స్థానికులు ఆయన ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు అభినందనలు తెలుపుతున్నారు. పలువురు మిఠాయిలు పంచుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు.
మరోవైపు పంజాబ్‌లోని సంగ్రూర్‌లో కూడా ఓ వ్యక్తికి రూ.కోటి లాటరీ తగిలినట్లు సమాచారం. నవంబర్ 16న పంజాబ్ స్టేట్ డియర్ దీపావళి బంపర్ 2026 డ్రా నిర్వహించారు. ఈ డ్రాలో సంగ్రూర్‌కు చెందిన ఓ వ్యక్తి కోటి రూపాయల బహుమతిని గెలుచుకున్నాడు. అయితే చాలా రోజులు గడుస్తున్నప్పటికీ ఆ విజేత ఎవరో ఇంకా గుర్తించలేదు. సంగ్రూర్ బస్టాండ్ సమీపంలోని లాటరీ దుకాణంలో టికెట్లు కొనుగోలు చేసినవారు తమ టికెట్లను మరోసారి పరిశీలించుకోవాలని దుకాణదారుడు విజ్ఞప్తి చేశాడు. మొత్తానికి 15 ఏళ్లుగా లాటరీ అదృష్టం కోసం ఎదురుచూసిన ఓ సాధారణ ట్రక్ డ్రైవర్‌కు ఏకంగా రూ.12 కోట్ల బహుమతి రావడం ఇప్పుడు పంజాబ్‌లో చర్చనీయాంశంగా మారింది.
#WATCH | Chandigarh: Baljinder Singh, a 45-year-old tipper driver from Hamayunpur village in Dera Bassi, wins the Rs 12 crore first prize in the Punjab State Dear Diwali Bumper 2026 lottery after buying a Rs 500 ticket from Handesra.
He says, "I bought the ticket on November 10. I found out yesterday. I have been playing the lottery for 15 years. I had faith in God that I would win, and God has heard my prayers. I drive a tipper truck for a living, and we also do farming. I have two children, a younger brother, my father, and my wife. I want to do something for my children’s future."
— ANI (@ANI) November 17, 2026
తాజావార్తలు
-
RS 12 Crore Lottery Jackpot: గెలిపించిన నమ్మకం.. 15 ఏళ్ల నిరీక్షణకు ఫలితం.. ట్రక్ డ్రైవర్‌కు రూ.12 కోట్ల లాటరీ!
-
Chiranjeevi on Kaaka: డెఫినెట్లీ కొడతాం.. ‘కాక’ సినిమాపై మెగాస్టార్ కీలక వ్యాఖ్యలు..!
-
CSK-IPL 2027: ధోనీ గుడ్‌బై.. జట్టులోకి ఇద్దరు డేంజర్ ప్లేయర్స్.. సీఎస్కే రిటెన్షన్, రిలీజ్, పర్స్ డీటెయిల్స్ ఇవే!
-
AP Panchayat Elections: సర్పంచ్ పదవికి రూ.51 లక్షలు.. దక్కించుకున్న జనసేన నేత
-
Ganja Racket Busted: కూరగాయల వ్యాపారం మాటున గలీజు దందా.. భారీగా గంజాయి, నగదు స్వాధీనం..!
ట్రెండింగ్
-
SRH-IPL 2027: హెడ్‌కు గుడ్‌బై.. మరో 8 మంది అవుట్.. ఎస్ఆర్హెచ్ రిటెన్షన్, రిలీజ్, పర్స్ డీటెయిల్స్ ఇవే!
-
MS Dhoni Drone Show: రెండు కళ్లు చాలవుగా చూడడానికి.. ధోనీ రెటైమెంట్తో ప్రత్యేక డ్రోన్ షో నిర్వహించిన సీఎస్కే..!
-
IPL 2027 Retentions: ధోనీ ఔట్.. ట్రావిస్ హెడ్, స్టార్క్‌కు షాక్.. 10 జట్ల రిటెన్షన్, రిలీజ్, పర్స్ డీటెయిల్స్ ఇవే!
-
200MP కెమెరా, AMOLED సెకండరీ డిస్ప్లే, 6,000mAh బ్యాటరీతో Xiaomi 18 Pro లాంచ్..!
-
200MP+200MP కెమెరాలు, IP66+IP68+IP69 రేటింగ్స్, 7,050mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ Xiaomi 18 Pro Max లాంచ్..!