Himanta Biswa Sarma: కాంగ్రెస్ 20 శాతం టికెట్లు అమ్ముకుంటోంది.. హిమంత సంచలన ఆరోపణ..

  • మరోసారి కాంగ్రెస్‌పై విరుచుకుపడిన హిమంత బిశ్వ శర్మ..
  • కాంగ్రెస్ 20 శాతం టికెట్లు అమ్ముకుంటుంది..
  • మహారాష్ట్ర..జార్ఖండ్ ఎన్నికల ముందు సంచలన వ్యాఖ్యలు..
Himanta Biswa Sarma

Himanta Biswa Sarma

Himanta Biswa Sarma: బీజేపీ నేత, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి కాంగ్రెస్ పార్టీపై సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ 20 శాతం టిక్కెట్లను అమ్ముకుంటుందని ఆరోపించారు. ఎన్నికల్లో ఈ డబ్బును వాడుకుంటుందని తెలిపారు. మొత్తం 10 సీట్లు ఉంటే, 20 సీట్లను డబ్బులకు అమ్ముకుంటుందని అన్నారు. రాబోయే రోజుల్లో ఎన్డీయే మరింత బలపడుతుందని చెప్పారు. తాను కూడా కాంగ్రెస్ నుంచి వచ్చిన వాడినే అని, ఈ విషయం తనకు తెలుసని అన్నారు.

Read Also: Tesla crash: టెస్లా కార్ క్రాష్.. బ్యాటరీల్లో మంటలు చెలరేగి నలుగురు భారతీయులు మృతి..

మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ముందు హిమంత బిశ్వ కాంగ్రెస్ గురించి ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష నేతలు మిమ్మల్ని గుండా అని విమర్శిస్తున్నాయని మీడియా ప్రశ్నించగా, మా అస్సాం రాష్ట్రంలో అలాంటి కాన్సెప్ట్ లేదని, వారు తనను గుండాగా పిలిస్తే పర్వాలేదు అని ఆయన వ్యాఖ్యానించారు. జార్ఖండ్ ఎన్నికలకు సంబంధించి హిమంత బిశ్వ శర్మ ఇన్ఛార్జ్‌గా ఉన్నారు.