Himanta Biswa Sarma Comments On Terrorism in Assam: ఇస్లామిక్ ఛాందసవాదుకులు ఈశాన్య రాష్ట్రాలు కేంద్రంగా మారుతున్నాయని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ గురువారం ఆందోళన వ్యక్తం చేశారు. గత ఐదు నెల్లలో అస్సాంలో 5 టెర్రర్ మాడ్యూల్స్ పట్టుబడటం ఆందోళనకు తావిస్తోందని ఆయన అన్నారు. ఇటీవల అస్సాంలో పలు ప్రాంతాల్లో అన్సరుల్లా బంగ్లా టీమ్ ఉగ్ర సంస్థతో సంబంధం ఉన్న ముస్తఫాను భద్రతా సంస్థలు అరెస్ట్ చేశాయి. ముస్తఫా మోరిగావ్ ప్రాంతంలో మదర్సా నిర్వహిస్తూ.. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నాడనే ఆరోపణలతో ఈ రోజు అధికారులు మదర్సాను కూల్చేశారు. యూఏపీఏ చట్టం కింద మదర్సాలను కూల్చివేసినట్లు బిశ్వశర్మ వెల్లడించారు.
ఈ ఏడాది ఐదు నెలల కాలంలో ఐదు టెర్రర్ మాడ్యూల్స్ బయటపడినట్లు సీఎం బిశ్వశర్మ వెల్లడించారు. మార్చి నెలలో బార్ పేటలో అన్సరుల్లా బంగ్లా టీమ్ తో సంబంధం ఉన్న ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. బయట నుంచి వచ్చే ఇమామ్ లను ఆదరించ వద్దని సీఎం ప్రజలను కోరారు. ప్రజలకు ఆయన గురించి తెలియకుంటే సమీప పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని సీఎం ప్రజలకు తెలిపారు. అస్సాంలో ఇప్పటి వరకు ప్రభుత్వ ఆధ్వర్యంలో నిడిచే 800 ప్రభుత్వ మదర్సాలను సాధారణ పాఠశాలలుగా మార్చినట్లు బిశ్వశర్మ తెలిపారు. అయితే ఇంకా రాష్ట్రంలో ఎన్నో ఖవామీ మదర్సాలు ఉ న్నాయని.. ప్రజలు, తల్లిదండ్రులు తమ పిల్లలకు ఏం చెబుతున్నారో గమనించాలని.. ఈ మదర్సాలపై నిఘా ఉంచాలని అన్నారు.
Read Also: WhatsApp : 22 లక్షల భారతీయుల అకౌంట్లు బ్లాక్..
గత 5 నెలల కాలంగా అస్సాంలో ఐదు టెర్రర్ మాడ్యుళ్లను పోలీసులు ఛేదించారు. మార్చి 4న బార్ పేటలో అన్సరుల్లా బంగ్లా టీంతో సంబంధాలు ఉన్న ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎప్రిల్ 14న బార్ పేటలోనే రెండో టెర్రర్ మాడ్యుల్ ను గుర్తించి మరో ఆరుగురిని అరెస్ట్ చేశారు. జోగి ఘేపాలో మూడవ టెర్రర్ మాడ్యూల్ ను పోలీసులు గుర్తించారు. ఇదే విధంగా సమీపంలోని త్రిపుర నుంచి నలుగురిని అరెస్ట్ చేశారు. అన్సరుల్లా బంగ్లాకు చెందిన నాల్గవ మాడ్యూల్ ను మోరిగావ్ లో అదుపులోకి తీసుకుంది భద్రతా బలగాలు. జూలై 27ర బార్ పేటలో ఐదవ మాడ్యుల్ చేధించి 9 మంది అనుమానిత ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు.