Himanta Sarma: హిమంత వ్యాఖ్యలతో బంగ్లాదేశ్‌లో కలకలం..

  • బంగ్లాదేశ్ చొరబాటుదారులపై హిమంత ఘాటు వ్యాఖ్యలు..
  • భారత్ దౌత్యవేత్తకు నిరసన తెలిపిన బంగ్లా ప్రభుత్వం..
Himanta Biswa Sarma

Himanta Biswa Sarma

Himanta Sarma: అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ చేసిన ప్రకటనలో బంగ్లాదేశ్ ఉలిక్కిపడింది. అక్రమ బంగ్లాదేశ్ వలసదారుల్ని రాత్రి సమయంలో వారి దేశానికి తోసేస్తాం అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ రియాక్ట్ అయింది. భారత తాత్కాలిక హైకమిషన్ పవన్ బధేకు అధికార నిరసన తెలిపింది. డైరెక్టర్ జనరల్(దక్షిణాసియా) ఇష్రత్ జహాన్ గురువారం భారత దౌత్యవేత్తకు బంగ్లాదేశ్ వైఖరిని తెలియజేశారు.

Read Also: Petrol-Diesel prices: పెట్రోల్-డీజిల్‌పై రూ. 4-5, LPGపై రూ. 40-50 పెరిగే ఛాన్స్..?

‘‘మర్యాద లేని వారికి మృదువైన భాష అర్థం కాదు. అస్సాం నుంచి చొరబాటుదారులను తరిమికొట్టేటప్పుడు మేము ఈ విషయాన్ని నిరంతరం గుర్తుంచుకుంటాము. నిన్న రాత్రి 20 మంది అక్రమ బంగ్లాదేశీయులను వెనక్కి పంపించాము’’ అని హిమంత అన్నారు. ఈ ప్రకటనపై బంగ్లాదేశ్ అభ్యంతరం తెలుపుతోంది. ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధాలను ఇవి దెబ్బతీస్తాయని ఇష్రత్ భారత దౌత్యవేత్తలో అన్నారు. ఈ వ్యాఖ్యలు బంగ్లాదేశ్-భారత్ సంబంధాలకు అవమానకరమని బంగ్లా అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇరు దేశాల ద్వైపాకిక్ష అంశాలపై చర్చించేటప్పుడు సంయమనం పాటించాలని కోరింది.

2024లో హసీనా ప్రభుత్వ పతనం తర్వాత, అధికారంలోకి వచ్చిన మహ్మద్ యూనస్ భారత వ్యతిరేకతను బంగ్లాదేశ్ వ్యాప్తంగా పెంచి పోషించారు. ఆ సమయం భారత్-బంగ్లా సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయితే, ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల తర్వాత ప్రజా ప్రభుత్వం ఏర్పడింది. ప్రధాని తారిక్ రెహ్మాన్ నేతృత్వంలోని ప్రభుత్వం భారత్‌తో సంబంధాలు పునరుద్ధరించుకునేందుకు ప్రయత్నిస్తోంది.