Rajnath Singh: ‘‘వర్క్ ఫ్రం హోమ్’’ విన్నా, కానీ తొలిసారి ‘‘వర్క్ ఫ్రం జైల్’’ వింటున్నా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajnath Singh: ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ని ఉద్దేశిస్తూ కేంద్ర రక్షణ మంత్రి విమర్శలు చేశారు. ఫతేఘర్ సాహిబ్ బీజేపీ ఎంపీ అభ్యర్థి గెజ్జా రామ్ వాల్మీకి కోసం జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) గురించి మాట్లాడుతూ.. ఇక్కడ ఆప్ అధికార పార్టీ, అది ఎలాంటి పని చేస్తుందో మీకు పెద్దగా చెప్పనవసరం లేదని అన్నారు. ఢిల్లీలో కూడా ఇదే పార్టీ ప్రభుత్వం ఉందని, కానీ మద్యం కుంభకోణంలో ఒక నాయకుడు జైలు పాలయ్యాడని సీఎం అరవింద్ కేజ్రీవాల్ గురించి మాట్లాడారు. ఒక వ్యక్తిపై ఏవైనా ఆరోపణలు వస్తే తన పదవికి రాజీనామా చేసే నైతిక ధైర్యం, ప్రతీ నాయకుడికి ఉండాలని తాను భావిస్తున్నట్లు రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.
Read Also: Uttar Pradesh: వీడియోలతో బ్లాక్ మెయిల్ చేస్తూ అత్యాచారం.. కత్తితో పొడిచి హత్య
Also Read
- Putin: విదేశాల ఒత్తిడికి భారత్ ఎన్నడూ లొంగలేదు.. ట్రంప్‌కు పుతిన్ స్ట్రాంగ్ మెసేజ్..
- India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
- TGPSC New Notification: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మరో నోటిఫికేషన్ విడుదల చేసిన TGPSC..
- Tamil Nadu: అన్నామలై ఎఫెక్ట్.. తమిళనాడు బీజేపీలో వరస రాజీనామాలు..!
మద్యం కుంభకోణంలో కేజ్రీవాల్ జైలు పాలయ్యాడని, అక్కడి నుంచే ముఖ్యమంత్రి పదవిని కొనసాగిస్తానని చెప్పాడని, మనందరికి వర్క్ ఫ్రం ఆఫీస్, వర్క్ ఫ్రం హోమ్ గురించి తెలుసని, కానీ తొలిసారి ‘‘వర్క్ ఫ్రండ్ జైల్’’ గురించి వింటున్నానని సెటైర్లు వేశారు. కాంగ్రెస్ అవినీతిపై అన్నాహజారేతో కలిసి కేజ్రీవాల్ ఉద్యమం చేసిన సమయంలో, దీనిని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవద్దని హజారే సూచించినప్పటికీ, కేజ్రీవాల్ తన గురువు మాట వినకుండా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)ని స్థాపించారని అన్నారు. ముఖ్యమంత్రి తన నివాసాన్ని ‘శీష్ మహల్’’గా మార్చి కోట్లాది ప్రజాధనాన్ని వినియోగించుకున్నాడని రాజ్‌నాథ్ ఆరోపించారు.
స్వాతి మలివాల్‌పై దాడి అంశం గురించి మాట్లాడుతూ..కేజ్రీవాల్ నివాసంలో మలివాల్‌పై దాడి చేసి, ఇప్పుడు దేశ ప్రజల ముందు ప్రసంగాలు చేస్తున్నాడని మండిపడ్డారు. ఈ విషయంపై కేజ్రీవాల్ 15 రోజుల పాటు మౌనంగా ఉన్నారని మంత్రి పేర్కొన్నారు. మీ నివాసంలో ఎంపీపై దాడి జరిగితే మౌనంగా ఉన్నాడని, అలాంటి వ్యక్తికి సీఎంగా కొనసాగే హక్కు ఉందా..? అని రాజ్‌నాథ్ ప్రజల్ని ప్రశ్నించారు. పంజాబ్ లోని 13 లోక్‌సభ స్థానాలకు జూన్ 1న ఎన్నికలు జరగనున్నాయి.
తాజావార్తలు
-
Mohali Love Murder: కిరాతకుడిగా మారిన సహోద్యోగి.. ఆఫీస్‌లోనే యువతి హత్య
-
Indiramma House: మోడ్రన్ టెక్నాలజీ వచ్చేసింది.. 12 రోజుల్లోనే ఇందిరమ్మ ఇంటి నిర్మాణం..
-
CM Revanth Reddy : కేసీఆర్ చర్చకు అసెంబ్లీకి రా.. పాలమూరును బొందపెట్టింది నువ్వే
-
Putin: విదేశాల ఒత్తిడికి భారత్ ఎన్నడూ లొంగలేదు.. ట్రంప్‌కు పుతిన్ స్ట్రాంగ్ మెసేజ్..
-
India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!