కొత్త నెంబర్ కాల్ వస్తుంది. రిసీవ్ చేయాలా వద్దా.. అనుకుంటూ ఆ కాన్ ను రిసీవ్ చేసాడు ఓ ఇంజనీర్. తీరా ఆ కాల్ లో ఓ అమ్మాయి బట్టలు లేకుండా వీడియో కాల్ మట్లాడుతుంది. ఏవేవో కబుర్లు చెబుతుంది. ఆ ఇంజరీన్ అలానే చూస్తూ వుండిపోయాడు. చివరికి ఆమాటలు, ఆమెను చూడలేక కాల్ కట్ చేసాడు. అయితే ఇక్కడే అతను సైబర్ మోసగాళ్ల వలలో చిక్కుకున్నాడు. అతని రిసీవ్ చేసిన వాట్సప్ కాల్ రికార్డ్ అయ్యింది. అది చూపిస్తూ.. ఇంజనీర్ కు సైబర్ నేరగాళ్లు బ్లాక్ మెయిల్ కు దిగారు. ఆ వాట్సప్ కాల్‌ను దోపిడీకి అస్త్రంగా మలుచుకున్నారు. రూ.25లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసారు. లేదంటే వీడియోను వైరల్ చేస్తామని బెదిరించారు. అయితే ఆ ఇంజనీర్ తొలుత తన ప్రతిష్టకు భంగం కలుగుతుందని భయపడి సైబర్ నేరగాళ్లకు ఆనగదు మొత్తం పంపించాడు.
అయితే తను మోసపోయానని గ్రహించిన ఇంజనీర్ పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. బాధితుడు.. భువనేశ్వర్లో ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్లో ఇంజినీర్ గా పనిచేస్తున్నాడు. అయితే అతనికి గుర్తు తెలియని నెంబర్ నుంచి కాల్ రావడంతో కాల్ రిసీవ్ చేసాని తెలిపాడు. అతను ఆ కాల్ రిసీవ్ చేసిన తీరును సైబర్ నేరగాళ్లు మార్పింగ్ చేసి బ్లాక్ మెయిల్ చేసి ఇంజనీర్ వద్ద నుంచి రూ.25 లక్షలు తీసుకున్నారని పేర్కొన్నారు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకండని ప్రజలకు పోలీసులు చెబుతున్న అమాయకులు వీరి వలలో పడి లక్షల్లో మోసపోతున్నారు. వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు, స్థానికులు కోరుతున్నారు.
Record Level Car Sales: దూసుకెళ్లిన కార్ల విక్రయాలు.. రెండేళ్ల కిందటి రికార్డు బద్ధలు..