గతేడాది చిన్న సినిమాగా విడుదల అయిన బలగం సినిమా అంచనాలకు మించి విజయం సాధించింది.ప్రతి ప్రేక్షకుడి నుండి ప్రశంసలను దక్కించుకుంది. తెలంగాణ గ్రామీణ సంస్కృతిని, సంప్రదాయాలను కళ్లకు కట్టినట్టు చూపిన ఈ ఎమోషనల్ సినిమాకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.జబర్దస్త్ కామెడీషోతో పాపులర్ అయిన వేణు ఎల్దండి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఎవరూ ఊహించని విధంగా బలగం చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించి.. తొలి మూవీతోనే దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు వేణు. బలగం సినిమా కమర్షియల్‍గా కూడా భారీ సక్సెస్ అయింది. ఘన విజయంతో పాటు చాలా అవార్డులను గెలుచుకున్న బలగం మూవీ రిలీజై నేటి (మార్చి 3)కి ఏడాది పూర్తయింది.బలగం సినిమా 2023 మార్చి 3వ తేదీన రిలీజ్ అయింది.రిలీజయ్యాక అందరి ఊహలకు మించి ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది.
తెలంగాణ గ్రామీణ వాతావరణాన్ని, కుటుంబ సభ్యుల మధ్య ఉండే మనస్పర్థలు, బంధాలను,భావోద్వేగాలను దర్శకుడు వేణు చూపించిన విధానం అందరిని ఎంతగానో ఆకట్టుకుంది.. రూ.3కోట్లతో రూపొందించిన ఈ చిత్రం ఏకంగా సుమారు రూ.27 కోట్ల వసూళ్లను సాధించింది.ఇదిలా ఉంటే బలగం సినిమాకు సంవత్సరం పూర్తయిన సందర్భంగా దర్శకుడు వేణు ఎల్దండి ఆసక్తికర ట్వీట్ చేశారు.”బలగం చిత్రానికి సంవత్సరం. మద్దతు తెలిపిన, ఆశీర్వదించిన అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు” అని వేణు ట్వీట్ చేశారు.బలగం సినిమాలో ప్రియదర్శి, కావ్య కల్యాణ్ రామ్ హీరోహీరోయిన్లుగా నటించారు. వీరిద్దరి యాక్టింగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.. కుటుంబ పెద్ద గాజుల కొమరయ్యగా నటించిన సుధాకర్ రెడ్డి కూడా తన నటనతో మెప్పించారు.అలాగే కోట జయరాం, కొమ్ము సుజాత, మురళీధర్ గౌడ్, రూపలక్ష్మి, మైమ్ మధు మరియు వేణు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు.భీమ్స్ సెసిరోలియో అందించిన సంగీతం బలగం సినిమాకు బాగా ప్లస్ అయింది. ఈ చిత్రంలోని పాటలు ప్రేక్షకులకు తెగ నచ్చేసాయి.
1 year of BALAGAM😍
Once again my thanks to everyone who has supported and blessed 🙏@PriyadarshiPN @KavyaKalyanram @DilRajuProdctns @dopvenu @LyricsShyam pic.twitter.com/egLqWLkLuQ
— Venu Yeldandi #Balagam (@VenuYeldandi9) March 3, 2024