పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో హమాస్ నాయకులు హల్‌చల్ సృష్టించారు. పశ్చిమాసియాకే పరిమితమైన వారి ప్రభావం ఇప్పుడు భారత్‌లో కూడా విస్తరించేందుకు కుట్ర జరుగుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో నిఘా వర్గాలు అప్రమత్తం అయ్యాయి.