First Kiss: “తొలి ముద్దు”కు దూరమవుతున్న జపాన్ హైస్కూల్ స్టూడెంట్స్..
- జపాన్‌లో వింత ధోరణ..
- ఫస్ట్ కిస్‌కి దూరమవుతున్న హైస్కూల్ స్టూడెంట్స్..
- జననాల రేటుపై తీవ్ర ప్రభావమంటున్న నిపుణులు..
- జపాన్‌లో పెరిగిన వృద్ధుల జనాభా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
First Kiss: జపాన్‌లో ఎప్పుడూ లేనంతగా వింత ధోరణి కనిపిస్తోంది. జపాన్ హైస్కూల్ అబ్బాయిల్ తమ ‘‘ఫస్ట్ కిస్’’కి దూరమవుతున్నట్లు తాజా సర్వేలో తేలింది. హైస్కూల్ బాయ్స్‌లో ప్రతీ ఐదుగురిలో ఒక్కరు మాత్రమే తొలి ముద్దు అనుభవాన్ని పొందుతున్నట్లు తేలింది. 1974 నుంచి ఇదే అత్యల్ప సంఖ్యగా తేలింది. జపాన్ అసోసియేషన్ ఫర్ సెక్స్ ఎడ్యుకేషన్ (JASE) 12,500 మంది విద్యార్థులపై జరిపిన సర్వేలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 2023లో అకడామిక్ ఇయర్‌లో నిర్వహించిన పోల్ ప్రకారం.. 22.8 శాతం మంది అబ్బాయిలు మాత్రమే తమ మొదటి ముద్దు అనుభవాన్ని పొందారని, అదే వయసులో ఉన్న 27.5 శాతం మంది అమ్మాయిలు తమ మొదటి ముద్దుని అనుభవించినట్లు సర్వే వెల్లడించింది.
Read Also: Andhra Pradesh: దేవాలయాల్లో అర్చకులకు కనీస వేతనం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం
Also Read
- Ganesh Chaturthi 2026: బొజ్జ గణపయ్య ప్రతిష్ఠకు శుభ ముహూర్తం.. పూజా సామగ్రి.. పూజా విధానం ఇదే!
- Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
- IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
- Ravi Shastri: పుతిన్, మోడీ, జిన్‌పింగ్.. బ్రిక్స్‌పై రవిశాస్త్రి సంచలన పోస్ట్..
2005లో తొలి ముద్దు పొందే స్కూల్ బాయ్స్ సంఖ్య గరిష్ట స్థాయికి చేరినప్పటికీ, ఇటీవల కాలంలో మళ్లీ క్షీణిస్తూ వస్తోంది. 1974 నుంచి అత్యల్ప స్థాయికి చేరింది. హైస్కూల్ అబ్బాయిలలో లైంగిక సంబంధం కలిగి ఉన్న వారి నిష్ఫత్రి కూడా 3.5 పాయింట్లకు తగ్గి 12 శాతానికి పడిపోయింది. హైస్కూల్ బాలికల్లో ఈ సంఖ్య 5.3 పాయింట్లకు తగ్గి 14.8 శాతానికి పడిపోయింది. ఈ ధోరణికి కోవిడ్ మహమ్మారి కూడా ఒక కారణమని సర్వే వెల్లడించింది. జపాన్ యువత ఇంట్లోనే ఉండి ఒంటరిగా లైంగిక విషయాలను చూడటానికి ఇష్టపడుతున్నారని, ఈ పరిణామం తక్కువ జననాల రేటును పెంచే ప్రమాదం ఉందని అక్కడి నిపుణులు భయపడుతున్నారు.
ప్రజలు లైంగికంగా చురుకుగా ఉండే సహజమైన సమయంలో కూడా, శారీరక లైంగిక కార్యకలాపాలకు దూరంగా ఉండే ధోరణిని ఇది చూపిస్తోందని సోషియాలజీ లెక్చరర్ తమకి కవాసకి పేర్కొన్నారు. ఇంట్లోనే ఉండి ఒంటరిగా లైంగిక కంటెంట్‌ని చూసే ధోరణి ఉంది. దేశ భవిష్యత్తుకు ప్రాతినిధ్యం వహిస్తున్న టీనేజ్ యువకులు ఇలాగే కొనసాగితే, ఇప్పటికే తక్కువగా ఉన్న జననాల రేటులో ఎలాంటి మార్పు కనిపించడని చెప్పారు. ఇటీవల కాలంలో జపాన్‌లో జననాల రేటు రేటు తగ్గడంతో పాటు వృద్ధ జనాభా పెరిగింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. దేశంలో జన్మించిన శిశువుల సంఖ్య 2023లో 8వ సంవత్సరం కూడా పడిపోయింది. 65 ఏళ్ల కన్నా ఎక్కువ వయసు కలిగిన వారి సంఖ్య 2024లో 36.25 మిలియన్లకు చేరుకుంది. ఇది జపాన్ మొత్తం జనాభాలో 29.3 శాతంగా ఉంది.
తాజావార్తలు
-
Toxic OTT: బాక్సాఫీస్‌లో షాక్.. ఇప్పుడు ఓటీటీలోకి యశ్ ‘టాక్సిక్’, స్ట్రీమింగ్ డేట్ ఇదేనా?
-
Oman Coast Ship Attack: ఒమన్ తీరంలో భారతీయ సిబ్బంది ఉన్న నౌకపై దాడి.. ఒకరు గల్లంతు
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Jailer2 Telugu Rights : జైలర్ 2 తెలుగు రైట్స్ కోసం దిల్ రాజు vs నాగవంశీ
-
Amol Muzumdar: భారత్‌కు ఆసియా కప్.. ట్రోఫీ మాత్రం వద్దంటూ బీసీసీఐ నిర్ణయం.. కోచ్ అమోల్ కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!