Gujarat IAS officer held hostage, thrashed: గుజరాత్ లో ఏకంగా ఓ ఐఏఎస్ అధికారిని బందీగా చేసుకుని చితకబాదారు కొందరు వ్యక్తులు. ఫిషరీస్ ప్రాజెక్టు తనిఖీలో భాగంగా సదరు వ్యక్తుల తప్పులను ఎత్తిచూపిన సందర్భంలో కాంట్రాక్టర్, అతడి అనుచరులు ఐఏఎస్ అధికారితో పాటు అతని సిబ్బందిని తీవ్రంగా కొట్టారు. ఈ ఘటన సబర్ కాంత జిల్లా పర్యటన సందర్భంగా చోటు చేసుకుంది. దాడికి పాల్పడిన ముగ్గురు వ్యక్తులపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
రాష్ట్రంలోని సబర్‌కాంత జిల్లాలోని ధరోయ్ డ్యామ్ సమీపంలోని ఒక గ్రామాన్ని సందర్శించడానికి వచ్చిన గుజరాత్ ఐఎఎస్ అధికారి నితిన్ సంగ్వాన్ ను బందీగా ఉంచినందుకు ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. ఫిషింగ్ కార్యకలాపాలతో సంబంధం ఉన్న వ్యక్తులు ఆయనను కొట్టారు. మత్స్యకార ప్రాజెక్టులో జరిగిన అక్రమాలను గుర్తించినందుకే దాడి చేసినట్లు తెలుస్తోంది. ఫిషరీష్ డైరెక్టర్ గా పనిచేస్తున్న సాంగ్వాన్ సోమవారం సబర్మతీ నదిపై నిర్మించిన ధరోయ్ డ్యామ్ సమీపంలోని అంబవాడ గ్రామానికి ఒక మత్స్యకార ప్రాజెక్టును పరిశీలించడానికి ఫిషరీస్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న సాంగ్వాన్ పాటు అతని సిబ్బంది వెళ్లారు.
Read Also: Kidney Stones: కిడ్నీనా, రాళ్ల గనినా.. ఏకంగా 3 వేల రాళ్లు
ఆనకట్ట నీటిలో “కేజ్ కల్చర్ ఫిషింగ్” ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వం స్థానిక కాంట్రాక్టర్లకు సబ్సిడీని అందిస్తుంది. తప్పులను గుర్తించడంతో బాబూ పర్మాన్ అనే కాంట్రాక్టర్ కోపంతో ఐఏఎస్ అధికారితో పాటు అతని సిబ్బందిని కొట్టాడు, ఇతడితో పాటు మరో నలుగురు వ్యక్తులు కూడా దాడికి పాల్పడ్డారు. మొత్తం 10 నుంచి 12 మంది వ్యక్తులు కలిసి వీరిని బందీలుగా చేసుకున్నారు. ఆ తరువాత వీరితో పోలీసులకు ఫిర్యాదు చేయమని కాగితంపై రాసి సంతకాలు తీసుకున్నారు, అధికారితో పాటు అతడి సిబ్బందిని డ్యాంలోకి విసిరేస్తామని బెదిరించారు.
అధికారి ఫిర్యాదు మేరకు పటేల్ వడాలి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. పలు సెక్షన్ల కింద బాబు పర్మాన్ అతడి అనుచరులపై కేసు నమోదు చేశారు. నిందితుల్లో దిలీప్ పర్మార్, నీలేష్ గామర్, విష్ణు గామర్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. మిగతా వారి కోసం గాలింపు చేపట్టినట్లు సంబర్ కాంత జిల్లా ఎస్పీ విశాల్ వాఘేలా తెలిపారు.