UtterPradesh: మనిషికి ఒక జన్మ ఉంటుందంటే అందరూ నమ్ముతారు. అదే పునర్జన్మ ఉంటుందంటే కొందరు నమ్ముతారు.. మరికొందరు లేదని వాదిస్తారు. పునర్జన్మ అనేది ఇప్పటి యావత్ మానవాళీకి అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలింది. అయితే అప్పడప్పుడు కొందరు తమ పునర్జన్మ ఇదేనంటూ పూసగుచ్చినట్టు చెబుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటారు. ఇపుడు అటువంటిదే ఒక ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగింది. 8 ఏళ్ల పిల్లాడు తన అమ్మమ్మ గత జన్మలో తన భార్య అని చెబుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. మొదట ఆ పిల్లాడి మాటలను నమ్మని కుటుంబ సభ్యులు .. పిల్లాడు చెప్పిన గతంలోని విషయాలను విన్నాక కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. ఆ వివరాలేంటో చూద్దాం..
Read also: Ramcharan-Upasana : పుట్టబోయే బిడ్డకు చిరు కానుక ఇచ్చిన ప్రజ్వలా ఫౌండేషన్…!!
ఉత్తర్‌ప్రదేశ్‌ఓని మైన్‌పూర్ జిల్లాలో పునర్జన్మకు సంబంధించిన ఉదంతం ఇపుడు వైరల్‌గా మారింది. ఎలావూ పోలీస్టేషన్ పరిధిలోని మంగల్‌పూర్ గ్రామంలో జరిగింది. జూన్ 15న 8 ఏళ్ల ఆర్యన్ తన తల్లితోపాటు రతన్‌పూర్ గ్రామానికి వచ్చాడు. ఆ పిల్లాడి తల్లి ఆర్యన్‌తో వెళ్లి అమ్మమ్మ కాళ్లకు దండం పెట్టు అని చెప్పింది. వెంటనే ఆ పిల్లాడు ఈమె నా అమ్మమ్మ కాదు.. నా భార్య అని చెప్పాడు. అలాగే అక్కడే ఉన్న తన మేనమామను తన కుమారుడని ఆర్యన్ చెప్పాడు. ఆర్యన్ మాటలను ముందు తేలికగా తీసుకున్నారు. అయితే ఆ పిల్లాడు అదే విషయాన్ని పదే పదే చెప్పడంతోపాటు.. గతంలో వారి కుటుంబంలో జరిగిన అన్ని సంఘటనలను పూసగుచ్చినట్టు చెప్పడం మొదలు పెట్టాడు. ఇవన్నీ తన గతజన్మకు సంబంధించిన విషయాలని ఆర్యన్ చెప్పాడు. గత జన్మలో తన పేరు మనోజ్ మిశ్రా అని 8 ఏళ్ల క్రితం అంటే 2015 జనవరి 9న తాను పొలంలో పని చేస్తుండగా అక్కడ ఒక రంధ్రం కనిపించిందని దానిని కాలితో మూసివేస్తుండగా పాము కరిచిందని చెప్పాడు. అపుడు తాను వెంటనే సృహా కోల్పోయానని .. తనను ఆసుపత్రికి తీసుకెళ్తుండగా దారిలోనే మృతి చెందానని చెప్పాడు.
Read also: TS Congress: కాంగ్రెస్‌లోకి పొంగులేటి, జూపల్లి.. ఈ నెల 22న రాహుల్ గాంధీతో భేటీ
పిల్లాడి నోటి నుంచి వచ్చిన ఈ మాటలు వినగానే అక్కడున్నవారంతా ఆశ్యర్యపోయారు. ఇదంతా వాస్తవమేనని.. ఆ పిల్లాడు గత జన్మలో మనోజ్ మిశ్రా అని వారు గుర్తించారు. ఆర్యన్ ఇంకా వివరాలు చెబుతూ తాను చనిపోయిన సమయంలో తన కుమార్తె(ఆర్యన్ తల్లి) గర్భవతి అని తెలిపారు. తాను చనిపోయాక తన దశదిన కర్మలు ముగిసిన వెంటనే తన కుమార్టె రంజన .. కుమారునికి జన్మనిచ్చిందని ఆర్యన్ చెప్పాడు. ఇదంతా విన్న తరువాత అక్కడున్న వారంతా మరోసారి ఆశ్చర్యపోయారు. సంఘటనలు విన్న తరువాత ఆర్యన్‌ది పునర్జన్మే అంటూ వారు అందరికీ చెబుతున్నారు. ఆర్యన్ తన అమ్మమ్మ నీరజ్ మిశ్రాను తన భార్య అని, మేనమామలైన అనుజ్, అజయ్‌లను తన కుమారులని, తన తల్లి రంజనను తన కుమార్తె అని చెబుతున్నాడు.
Read also: Guntur Kaaram: మరో నెల రోజుల పాటు సైలెంట్?
ఈ సంఘటనలపై ఆర్యన్ మేనమామ అజయ్ మాట్లాడుతూ నాలుగేళ్ల వయసు నుంచి ఆర్యన్ తన గత జన్మ విషయాలను చెబుతున్నాడని.. అయితే తాము వాటిని ఎప్పుడూ సీరియస్‌గా తీసుకోలేదని.. కానీ ఇపుడు నమ్మక తప్పడం లేదని అన్నారు. ఈ మధ్య ఆర్యన్ చెబుతున్న విషయాలు మరింత ఆశ్చర్యకరంగా ఉన్నాయన్నారు. ఆర్యన్ అమ్మమ్మ నీరజ్ మిశ్రా కూడా ఆ పిల్లాడి మాటలు నిజమేనని చెబుతోంది.