Period Celebrations: గ్రాండ్‌గా పీరియడ్ డే సెలబ్రేషన్స్.. అత్యంత పవిత్రమైనదిగా చెప్పడానికే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Period Celebrations: సాధారణంగా పుట్టిన రోజు, పెళ్లి రోజు వేడుకలను ఘనంగా జరుపుకుంటారు. వీటిలో కూడా మొదటి పుట్టిన రోజు.. మొదటి పెళ్లి రోజు వేడుకలను ఇంకా ఘనంగా నిర్వహిస్తారు. అలాంటిది ఒక తండ్రి తన కూతురు ఫస్ట పీరియడ్ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశాడు. ఇది చేయడానికి కారణం ఉందంటున్నాడు ఆ తండ్రి. రుతుస్రావం జరిగిన సమయంలో మహిళలు, బాలికలను తాకొద్దని.. ఆ సమయంలో అపవిత్రంగా ఉంటారని వారిని దూరంగా ఉంచాలని నేటికీ మన సమాజంలో ఉందని.. కానీ దానిని తొలగించి వారిని గౌరవించేలా చూడాలనే తాను ఈ విధంగా సెలబ్రేషన్స్ చేసినట్టు చెబుతున్నాడు. రుతుస్రావం అనేది ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైనదనే సందేశాన్ని సమాజానికి ఇవ్వడానికే తాను ఇలా చేశానంటున్నాడు. ఈ సెలబ్రేషన్స్ ను ఉత్తరాఖండ్‌లో నిర్వహించారు. ఆ వివరాలు చదవండి..
Read also: MadhyaPradesh: మైనర్‌పై సామూహిక అత్యాచారం.. తప్పించుకునే క్రమంలో బ్రిడ్జిపై నుంచి జంప్
Also Read
- PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
- Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
- Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
రాకెట్ యుగంలో ఉన్నప్పటికీ ఇప్పటికీ కొన్నింటిని సంస్కృతి, సంప్రదాయాలు అంటు కొనసాగిస్తున్నారు. అలాంటి వాటిలో కొన్నింటిని మార్చాల్సిన అవసరం ఉందని కొందరు అభ్యుదయ వాదులు చెబుతున్నారు. ఇప్పటికీ ప్రజలు పీరియడ్స్ అంటే రుతుక్రమం గురించి మాట్లాడటానికి సిగ్గుపడుతున్నారు. పీరియడ్స్ సమయంలో మహిళలు వంటగదికి వెళ్లడానికి అనుమతించరు, కుటుంబ కార్యక్రమాలకు హాజరు కాకూడదని చెబుతుంటారు.. కానీ ఈ అపోహను బ్రేక్ చేస్తూ, ఉత్తరాఖండ్‌లో జితేంద్ర భట్ కేక్ కట్ చేసి తన కుమార్తె మొదటి పీరియడ్‌ను వేడుకగా జరిపారు. కుటుంబ సభ్యులు కేక్ కట్ చేసి కూతురి ఫస్ట్ పీరియడ్ సెలబ్రేట్ చేసుకున్నారు. ‘రుతుస్రావం ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైనది’ అనే సందేశాన్ని సమాజానికి ఇవ్వడానికి వారు తమ కుమార్తె మొదటి పీరియడ్ ను ఇంటిని అలంకరించి కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఉత్తరాఖండ్ ఉధమ్ సింగ్ నగర్ లోని కాశీపూర్ నగరానికి చెందిన జితేంద్ర భట్ అనే వ్యక్తి తన కుమార్తె మొదటి పీరియడ్ ను పురస్కరించుకుని తన ఇంటిని బెలూన్లతో అలంకరించాడు. వృత్తిరీత్యా సంగీత ఉపాధ్యాయుడైన జితేంద్ర భట్ “రుతుస్రావం ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైనది” అనే సందేశాన్ని సమాజానికి ఇవ్వడానికి ఇటువంటి చర్య తీసుకున్నారు. చిన్నప్పుడు దీని గురించి పెద్దగా తెలియదు. నేను పెద్దయ్యాక, పీరియడ్స్ ఉన్నందుకు లేదా దాని గురించి మాట్లాడినందుకు మహిళలు, బాలికలను చిన్నచూపు చూడటం గమనించాను. ఈ సమయంలో స్త్రీ దేనినైనా తాకితే అది అపవిత్రంగా పరిగణించబడుతుంది. ఈ అపోహలన్నింటినీ తొలగించడానికి నా కుమార్తె మొదటి పీరియడ్ ను ఘనంగా జరపాలని అనుకున్నానని.. ఇది మలినాలు, అంటరానితనం అనే వ్యాధి కాదని, సంతోషకరమైన రోజని బాలిక తండ్రి తెలిపారు.
Read also: CM KCR : ధాన్యం దిగుబడిలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ స్థాయికి చేరుకుంది
జితేంద్ర చొరవకు స్థానికులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పీరియడ్స్ సమయంలో అమ్మాయిలు అపవిత్రులు అవుతారనే అపోహను తొలగించడానికి సహాయపడుతుందన్నారు. గైనకాలజిస్ట్ డాక్టర్ నవప్రీత్ కౌర్ .. ఇది చాలా మంచి చొరవ, ఎందుకంటే ప్రజలు దీనిని అంటరానితనంగా భావించే విధానం పూర్తిగా తప్పు. ఇది వ్యాధి కాదు, అంటరానితనం కాదు. పీరియడ్స్ సమయంలో ప్రతిరోజూ స్నానం చేసి, పూజలు చేసి, ప్రతిరోజూ గుడికి వెళ్లవచ్చని అన్నారు. పీరియడ్ థీమ్‌పై డిజైన్ చేసిన జితేంద్ర .. కేక్ రంగును తెలుపు, ఎరుపుగా ఉంచారు.. కానీ కేక్ మీద “హ్యాపీ పీరియడ్స్ రాగిణి” అని వ్రాయమని జితేంద్ర కేక్ తయారీదారుని కోరినప్పుడు, అతను అతని వైపు వింతగా చూస్తూ, “నేను మొదటి సారి అలాంటి కేక్ చేస్తున్నానని చెప్పినట్టు పేర్కొన్నారు. రాగిణి పీరియడ్ పార్టీ ఫోటోలను జితేంద్ర ఫేస్బుక్లో పంచుకున్నారు. హ్యాపీ పీరియడ్ రాగిణి అంటూ చేసిన పోస్టులు చాలా మంది ప్రశంసలు పొందింది. గర్వించదగిన క్షణమని ఒకరు కామెంట్ చేయగా, మరొకరు ఒక గొప్ప చొరవ అని ట్వీట్ చేశారు.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!