పసిడి ప్రేమికులకు గుడ్‌న్యూస్ చెబుతూ.. మరోసారి స్వల్పంగా కిందికి దిగివచ్చాయి బంగారం ధరలు.. గత మూడు రోజులుగా స్థిరంగా కొనసాగుతూ వచ్చిన పుత్తడి ధరలు.. ఇవాళ రూ.60 తగ్గింది… దీంతో.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,970గా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,373కి చేరింది.. ఇక, పసిడి దారిలోనే వెండి ధర కూడా తగ్గింది.. రూ. 900 మేర తగ్గి.. కిలో వెండి ధర రూ.55,400 దగ్గర కొనసాగుతోంది..
Read Also: Vizag Railway Zone: విశాఖ రైల్వే జోన్‌పై కేంద్రం అలా.. ఏపీ బీజేపీ నేతలు ఇలా..!
దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 50,350గా ఉంటే.. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 46,150కి చేరంది.. ఇక, కోల్‌కతాలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,200 కాగా, 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 46,000గా ఉంది.. ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,200 అయితే, 22 క్యారెట్ల బంగారం రేట్ రూ.46 వేలకు పరిమితమైంది.. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,285 కాగా, 22 క్యారెట్ల పసిడి ధర రూ.47,927గా ఉంది.. భువనేశ్వర్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,200 అయితే, 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,000 దగ్గర ట్రేడ్ అవుతోంది.. మరోవైపు, హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,970గా ఉంటే.. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,800గా.. విజయవాడలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,970 అయితే, 22 క్యారెట్ల పసిడి ధర రూ.45,800గా కొనసాగుతోంది..