Vijay Deverakonda Responds on Liger Failure: విజయ్ దేవరకొండ-పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన లైగర్ సినిమా దారుణమైన డిజాస్టర్ గా నిలిచింది. అనన్య పాండే హీరోయిన్ గా తెరకెక్కిన ఈ పాన్ ఇండియా సినిమా వసూళ్ళలో దారుణంగా వెనక పడింది. ఇక ఈ సినిమా రిజల్ట్ మీద మొదటి సారిగా పబ్లిక్ లో స్పందించాడు విజయ్ దేవరకొండ. తాజాగా విజయ్ దేవరకొండ హీరోగా సమంత హీరోయిన్ గా శివ నిర్వాణ డైరెక్షన్లో తెరకెక్కిన ఖుషీ సినిమా ట్రైలర్ లాంచ్ సందర్భంగా విజయ్ ఈ మేరకు కామెంట్ చేశారు. ఒక సినిమా ఆడక పోతే బాధ కలుగుతుంది కానీ మరో సినిమా చేయకుండా నన్ను ఆపలేదు. నాకు లైగర్ ఒక్కటే ఫ్లాప్ కాదు అంతకు ముందు కూడా నా కెరీర్ లో చాలా ఫ్లాప్ సినిమాలు ఉన్నాయి, నా కెరీర్లో చాలా హిట్ సినిమాలు కూడా ఉన్నాయి.
Khushi: ఆ సినిమాను గుర్తుచేస్తున్న ఖుషి.. ఎక్కడో కొడుతున్నట్టే ఉందే.. ?
ఇక మీదట కూడా ఫ్లాప్ సినిమాలు చేస్తాను, హిట్ సినిమాలు చేస్తాను అని అంటూ కామెంట్ చేశారు. మా లక్ష్యం మంచి కంటెంట్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకుని రావడం, మా లక్ష్యం ఏదైనా గొప్పగా చేయడం అని ఆయన అన్నారు. నా లైఫ్ స్టైలే అంత, చిల్ గా ఉండాలి అని అర్థం వచ్చేలా కామెంట్ చేసిన దేవరకొండ కొన్ని సార్లు సినిమా రిజల్ట్స్ మనల్ని హర్ట్ చేస్తాయి అంటే ఎలా చెప్పాలి, నాకు ఫెయిల్యూర్స్ అంటే భయం లేదు, నిజానికి అవి హర్ట్ చేస్తాయి కానీ నేను మరో సినిమా చేయకుండా ఆపలేవని అన్నారు. నేను కింద పడతానని భయం లేదు, పడితే బాధ పడతా కానీ నేను పరిగెత్త కుండా ఆపలేరు అని అన్నారు. పడినా లేచి పరిగెడతా అలాగే జీవించాలి అని ఆయన చెప్పుకొచ్చారు.