Gold Seize: చెన్నై ఎయిర్ పోర్టులో భారీగా బంగారం సీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇందుగలడు సందేహం వలదు.. ఎందెందు వెదకినా.. అన్న చందంగా బంగారం ఎక్కడ బడితే అక్కడ బంగారం బయటపడుతోంది. ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు బంగారం వివిధ రూపాల్లో తరలిస్తూ అడ్డంగా దొరికిపోతున్నారు. దేశవ్యాప్తంగా వివిధ విమానాశ్రయాల్లో బంగారం సీజ్ చేయబడుతోంది. కస్టమ్స్ అధికారుల కళ్ళుగప్పి మరీ బంగారాన్ని తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. దొరికితే దొంగ… దొరక్కపోతే దొర అన్నట్టుగా వుంది వీరి వ్యవహారం.
తాజాగా చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం లో బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణీకుల వద్ద 89.11 లక్షల విలువ చేసే 2 కేజీల బంగారం సీజ్ చేశారు కస్టమ్స్ అధికారులు. బంగారాన్ని పేస్టు గా మార్చి పొట్టలో, లోదుస్తుల్లో దాచి తరలించే ప్రయత్నం చేశారు కేటుగాళ్లు. కస్టమ్స్ అధికారులు నిర్వహించిన స్కానింగ్ లో అక్రమ బంగారం గుట్టురట్టయింది. దీంతో బంగారం సీజ్ చేసి ఇద్దరిని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కస్టమ్స్ అధికారులు.
Also Read
- Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
- UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
- Satyagraha: రాహుల్ గాంధీ కొత్త అస్త్రం .. ఒంటరిగా పోరాడొద్దు.. తోడుగా నేనుంటా!
- Flydubai Pilot: కెప్టెన్ స్మిత్ మచ్చార్‌కు రూ.1 కోటి.. Flydubai ఘటనలో ధైర్యానికి Mankind Pharma భారీ సత్కారం
Read Also: IND Vs SA: దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు కెప్టెన్‌గా శిఖర్ ధావన్
సరిగ్గా రెండురోజుల క్రితమే భారీగా బంగారం ఢిల్లీ విమానాశ్రయంలో పట్టుబడింది. కస్టమ్స్ అధికారులు ఎంత పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నా బంగారాన్ని తరలించేందుకు ఏమాత్రం భయపడడంలేదు. అరెస్ట్ చేస్తారనే భయం కూడా లేకుండా వారిపని వారు చకచకా చేసుకుంటూ పోతున్నారు. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. ఇండోనేషియా ప్రయాణీకుల వద్ద 76.5 లక్షల విలువ చేసే 1700 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేసిన సంగతి తెలిసిందే. కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా బంగారాన్ని గాజులుగా మార్చి కార్బన్ పేపర్ లో చుట్టి లగేజ్ బ్యాగ్ లో దాచారు. వారి గుట్టు రట్టయింది. దీంతో ప్రయాణీకులను అరెస్ట్ చేసారు. బంగారం రవాణా చేస్తున్న వారిపై కస్టమ్స్ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు.
అంతకుముందు ఏపీలోని గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీగా బంగారాన్ని పట్టుకున్నారు. దుబాయ్ నుండి వచ్చిన విమానంలో భారీగా బంగారం పట్టుబడింది. హైదరాబాద్ నుంచి స్పెషల్ టీమ్ ప్రత్యేక తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా, సీఎంఓ కార్యాలయంలో కీలక అధికారి భార్య దుబాయ్ నుండి సుమారు కిలో బంగారం తీసుకుని వచ్చి పట్టుబడింది.
Read Also: Gaddar : ఎర్ర మందారం కలర్ మారుతుందా..?
తాజావార్తలు
-
Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
-
Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
-
UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
-
Young Heroines : తల్లయితే తప్పేంటి?
-
Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!