Congress: కూలైన జీ23 లీడర్స్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జీ-23 కాంగ్రెస్ అసమ్మతి నేతల వరుస భేటీలు దేశ రాజకీయాల్లో కాకరేపాయి. రెబల్స్ నేతల సమావేశాలపై హాట్‌హాట్‌గా చర్చలు, విశ్లేషణలు సాగాయి. అయితే వరుస భేటీలతో హీట్ పెంచిన సీనియర్లు మొత్తానికి చల్లబడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ భేటీ అయ్యారు. 10 జనపథ్‌లోని ఆమె నివాసంలో సమావేశమై గంటకు పైగా పలు కీలక అంశాలపై చర్చించారు. సోనియాతో ముఖ్యంగా ఇటీవలి 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ఆజాద్ చర్చించారు. పార్టీలో నాయకత్వ మార్పు అంశంపై జీ23 సభ్యుల అభిప్రాయాలను వివరించారు. భేటీ అనంతరం ఆజాద్ మీడియాతో మాట్లాడుతూ.. సోనియాగాంధీతో భేటీ సంతృప్తికరంగా సాగిందన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఓటమిపై అభిప్రాయాల్ని పంచుకునేందుకే ఆమెతో భేటీ అయినట్లు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో కలిసికట్టుగా పని చేయాలని, ప్రతిపక్షాలను ఓడించే అంశంపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు చెప్పారు. కాంగ్రెస్ నేతలంతా సోనియా గాంధీ నేతృత్వంలో ముందుకు సాగేందుకు సుముఖంగా ఉన్నారని, కొన్ని సలహాలు మాత్రం ఆమెతో పంచుకున్నట్లు వెల్లడించారు. పార్టీని మరింత పటిష్టం చేసేందుకు సలహాలు ఇచ్చానని ఆజాద్ వెల్లడించారు.
Read Also: Weather Update: భానుడి భగభగలు.. 3 రోజులు జాగ్రత్త..
Also Read
- Woman Litters In Train: రైలు కోచ్‌లో చెత్త విసిరి, సీటు పక్కనే చేతులు కడిగిన మహిళ.. సివిక్ సెన్స్‌పై దేశవ్యాప్తంగా చర్చ
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్‌లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
- PM Modi: సీషెల్స్‌లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
- NCERT: 9వ తరగతి సిలబస్‌లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
అయితే గాంధీలు తప్పుకోవాలంటూ కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబాల్ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారమే రేపాయి. ఆ తర్వాత ఆజాద్ నివాసంలో జీ-23 నేతల వరుస భేటీలు పార్టీలో ప్రకంపనలు సృష్టించాయి. ఇటీవలి ఎన్నికల ఫలితాల్లో ఓటమి బాధ్యత ఎవరు తీసుకుంటారని పార్టీ సీనియర్ మనీశ్ తివారి ప్రశ్నించడం పార్టీని మరింత ఇబ్బందుల్లోకి నెట్టింది. అయితే ఆజాద్ సోనియాతో భేటీ అయి ఆమె నేతృత్వంలో ముందుకు సాగుతామని చెప్పడంతో ఈ ఎపిసోడ్‌కు పుల్‌స్టాఫ్ పడినట్లు అయ్యింది. మరోవైపు గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కరణ్ సింగ్‌ను కలిశారు. ఢిల్లీలోని కరణ్ సింగ్ నివాసానికి వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు. కరణ్ సింగ్ ఇంటి నుంచి తిరిగి వస్తుండగా ఆజాద్‌ను మీడియా ప్రతినిధులు భేటీకి గల కారణాన్ని ప్రశ్నించారు. కరణ్ సింగ్‌కు హోలీ శుభాకాంక్షలు చెప్పేందుకు ఆయన ఇంటికి వచ్చానన్నారు ఆజాద్. ఈ విషయాన్ని ఎక్కువగా తీసుకోవదన్నారు. G23 నేతల వరుస సమావేశాల తర్వాత… ఆజాద్ కరణ్ సింగ్‌ను కలవడం కొత్త చర్చకు దారితీసింది. హోలీ శుభాకాంక్షలు చెప్పడానికేనా లేక మరేదైనా కారణం ఉందా అన్న ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.
తాజావార్తలు
-
JioHotstar Trending: 12,000 కోట్ల బ్లాక్ బస్టర్‌కే షాక్.. జియో హాట్‌స్టార్‌లో ఈ రొమాంటిక్ థ్రిల్లర్ దే హవా!
-
iPhone 16: ఫ్లిప్‌కార్ట్ GOAT Sale కంటే ముందే iPhone 16పై భారీ తగ్గింపు..!
-
NBK 112 : బాలయ్య -కొరటాల మాస్ సినిమా కాదు.. అంతకుమించి
-
Hyderabad: షా గౌస్, మెహ్‌ఫిల్‌లలో దారుణంగా కిచెన్లు.. ఈగలు, మురికి కూపాలను చూసి షాకైన అధికారులు!
-
Lenin movie trailer : లెనిన్ ట్రైలర్ రిలీజ్ డేట్ లాక్.. అయ్యగారు ఆన్ ట్రాక్
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్‌తో మరింత సౌలభ్యం.!