Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Ghulam Nabi Azad Comments On Rahul Gandhi

Ghulam Nabi Azad: నేను మోడీ ఏజెంట్‌ని కాదు.. ఆయనను కౌగిలించుకున్నది నేనా?

Published Date :August 29, 2022 , 12:45 pm
By Mahesh Jakki
Ghulam Nabi Azad: నేను మోడీ ఏజెంట్‌ని కాదు.. ఆయనను కౌగిలించుకున్నది నేనా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Ghulam Nabi Azad: గత వారం కాంగ్రెస్‌ నుంచి వైదొలిగిన గులాం నబీ ఆజాద్‌ కాంగ్రెస్ అత్యున్నత నిర్ణయాధికార సంస్థ, కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ “అర్ధరహితంగా” ఉందని ఆరోపించారు. జీ23 లెటర్‌ రాయడమే రాహుల్‌ ఆగ్రహానికి కారణమని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. తాను కాంగ్రెస్‌ను వీడాలని పార్టీ పెద్దలు కోరుకున్నారని, తన అవసరం లేదని కాంగ్రెస్‌ అనుకుందని.. అందుకే న కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసినట్లు ఆయన చెప్పుకొచ్చారు. మోడీ రాజ్యసభలో తన గురించి చెప్పలేదని.. కశ్మీర్‌లో జరిగిన ఓ సంఘటన గురించి మాట్లాడారన్నారు. తాను మోడీ ఏజెంట్‌ను కాదని ఆజాద్ చెప్పారు. లోక్‌సభలో మోడీని కౌగిలించుకున్నది ఎవరు.. నేనా అంటూ రాహుల్ గాంధీని ఉద్దేశించి ఎద్దేవా చేశారు. రాహుల్.. మోడీని ఓ సాకుగా చూపించారని ఆయన ఆరోపించారు. “ప్రధాని నరేంద్ర మోడీపై ఎడమ, కుడి, మధ్యలో దాడి చేయడమే రాహుల్ గాంధీ విధానం” అని కూడా ఆయన పేర్కొన్నారు.

ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీలు చాలా వరకు సంప్రదింపుల రాజకీయాలను నమ్ముతారని కేంద్ర మాజీ మంత్రి ఆజాద్ అన్నారు. కానీ రాహుల్ గాంధీ హయాంలో అది నాశనం అయిందని ఆయన అన్నారు.”సోనియా గాంధీ, 1998-2004 మధ్య పూర్తిగా సీనియర్ నేతలతో సంప్రదింపులు జరిపారు. ఆమె వారిపై ఆధారపడి ఉంది, సిఫార్సులను ఆమోదించింది. ఆమె నాకు ఎనిమిది రాష్ట్రాలు ఇచ్చింది, నేను ఏడు గెలిచాను, ఆమె జోక్యం చేసుకోలేదు. కానీ రాహుల్ గాంధీ వచ్చిన తర్వాత 2004 నుంచి సోనియా గాంధీ రాహుల్ గాంధీపై ఎక్కువగా ఆధారపడటం మొదలుపెట్టారు. ఆయనకు అలా చేసే అర్హత లేదు. ప్రతి ఒక్కరూ రాహుల్ గాంధీతో సమన్వయం చేసుకోవాలని ఆమె కోరుకున్నారు” అని ఆజాద్ అన్నారు.

ఆ పార్టీ అధినేత్రి సోనియాకు రాసిన లేఖ‌లో రాహుల్ గాంధీ తీరును ఆజాద్ తీవ్రంగా ఖండించారు. రాహుల్ అప‌రిప‌క్వత కాంగ్రెస్ పార్టీని నాశ‌నం చేసిన‌ట్లు ఆజాద్ ఆరోపించారు. పార్టీలో సంప్రదింపు వ్యవ‌స్థను రాహులే ధ్వంసం చేసిన‌ట్లు విమ‌ర్శలు గుప్పించారు. దుర‌దృష్టవ‌శాత్తు రాహుల్ రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన త‌ర్వాత పార్టీలో ఉన్న పాత విధానాలు దెబ్బతిన్నట్లు ఆజాద్ ఆరోపించారు. 2013లో రాహుల్‌ను పార్టీ ఉపాధ్యక్షుడిగా సోనియా నియ‌మించార‌ని, కానీ సంప్ర‌దింపుల వ్యవ‌స్థను రాహుల్ నాశ‌నం చేసిన‌ట్లు ఆరోపించారు. రాహుల్‌లో పరిపక్వత లేదనడానికి మరో సంఘటనను ఉదాహరణగా గులాం నబీ ఆజాద్ చెప్పారు. ఓ సారి ప్రభుత్వ ఆర్డినెన్స్‌ను రాహుల్ గాంధీ మీడియా ముందే బ‌హిరంగంగా చింపివేసిన‌ట్లు వెల్లడించారు. చిన్నపిల్లాడి మ‌న‌స్తత్వంతో వ్యవ‌స్థను చిన్నాభిన్నం చేసిన‌ట్లు ఆజాద్ ఆరోపించారు. ప్రధాని, కేంద్ర ప్రభుత్వ అధికారాల్ని చిన్న‌చూపు చూసిన‌ట్లు విమ‌ర్శించారు. 2014లో యూపీఏ ప్రభుత్వం ఓట‌మి చెంద‌డానికి అది ప్రధాన కార‌ణ‌మైన‌ట్లు ఆజాద్ ఆరోపించారు.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bjp
  • congress
  • Ghulam Nabi Azad
  • Ghulam Nabi Azad on rahul gandhi
  • jammu kashmir

తాజావార్తలు

  • RBI: ఆర్బీఐ కీలక ప్రతిపాదన.. రూ.10,000 కు పైగా UPI, నెట్ బ్యాంకింగ్ లావాదేవీలకు ఒక గంట వేచి ఉండాల్సిందే..!

  • Karimnagar: పోలీస్ శాఖలో నకిలీ ఐడీలతో జీతాలను చోరీచేసిన పోలీస్ అధికారి.. ఏకంగా రూ.1.40 కోట్లు

  • Jananayagan : ‘జననాయగన్’ సినిమాను సోషియల్ మిడియాలో షేర్ చేస్తే చట్టపరమైన చర్యలు

  • Case Filed Against Janasena ZPTC: నమ్మించి మోసం చేశాడంటూ మహిళ ఫిర్యాదు.. జనసేన జడ్పీటీసీపై కేసు నమోదు..

  • AI Impact on Jobs: ఆంత్రోపిక్ షాకింగ్ రిపోర్ట్.. కోడింగ్ నుంచి సేల్స్ వరకు ఈ టాప్ 10 కెరీర్లు ముగిసినట్టే..!

ట్రెండింగ్‌

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions