Indian economy: మార్చి త్రైమాసికం(జనవరి-మార్చి)లో భారత ఆర్థిక వృద్ధి రేటు 7.8 శాతం నమోదైంది. దీంతో వార్షిక వృద్ధిరేటు 8.2 శాతానికి పెరిగింది. డిసెంబర్ త్రైమాసికంలో నమోదైన 8.6 శాతం కన్నా తక్కువగా ఉన్నప్పటికీ, గతేడాది(2022-23) ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలంతో(జనవరి-మార్చి)తో పోలిస్తే మెరుగైన ఫలితాలు నమోదయ్యాయి. 2022-23 ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి కాలంలో స్థూల దేశీయోత్పత్తి (GDP) 6.2 శాతం నమోదైంది.
Read Also: Gangs Of Godavari : విశ్వక్ సేన్ మూవీ చూసిన బాలయ్య..అదిరిపోయిందంటూ ప్రశంసలు..
2022-23లో 7%గా ఉన్న ఆర్థిక వ్యవస్థ 2023-24 ఆర్థిక సంవత్సరంలో 8.2% వృద్ధి చెందిందని NSO డేటా వెల్లడించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ రేటు 7.7 శాతంగా అంచనా వేసింది. అయితే, NSO రెండవ ముందస్తు అంచనాను కూడా అధిగమించి 2023-24 వార్షిక వృద్ధిరేటు 8.2గా నమోదైంది. తయారీ రంగం యొక్క బలమైన పనితీరు కారణంగా గత సంవత్సరంలో కన్నా మంచి వృద్ధిరేటు నమోదైంది. 2024 మొదటి మూడు నెలల్లో చైనా 5.3% ఆర్థిక వృద్ధిని నమోదు చేసింది, అదే కాలంలో భారతదేశం యొక్క బలమైన ఆర్థిక పనితీరును హైలైట్ చేస్తుంది.