Economy vs Rupee: భారత ఆర్థిక వ్యవస్థ అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ, రూపాయి విలువ మాత్రం అమెరికా డాలర్‌తో పోలిస్తే చరిత్రలో తొలిసారిగా 90 రూపాయల మార్కుకు చేరుకుని బలహీనపడింది.
Union Budget 2025: 2025-26 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం ఉదయం 11 గంటలకు లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆమె బడ్జెట్ ప్రసంగం ప్రారంభించారు. ఆర్థిక మంత్రివర్గం ఇప్పటికే ఈ బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. నిర్మలమ్మ వరుసగా ఎనిమిదోసారి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టడంతో రికార్డు నెలకొల్పారు. బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ నిర్మలా సీతారామన్.. “వికసిత భారత్” లక్ష్యం దిశగా భారత్ అడుగులు వేస్తోందని తెలిపారు. ఈ ప్రసంగం ప్రారంభం సమయంలో…
రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం పెద్ద షాక్ ఇచ్చారు. రిజర్వ్ బ్యాంక్ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశంలో దేశ వృద్ధి రేటుకు సంబంధించి ఆయన తన అంచనాను వెల్లడించారు. ఈ అంచనా ప్రకారం.. FY 25కి దేశ జీడీపీ వృద్ధి తక్కువగానే ఉండవచ్చు. ఈ సమావేశంలో 25 ఆర్థిక సంవత్సరానికి దేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు అంచనాను గవర్నర్ 7.2 శాతం నుంచి 6.6 శాతానికి తగ్గించారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ రెండో త్రైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాన్ని ఈరోజు (డిసెంబర్ 6) ప్రకటించనుంది. అయితే, ఈసారి కూడా కీలక వడ్డీరేట్లను యథాతథంగానే ఉంచే ఛాన్స్ ఉంది.
Indian economy: జనవరి - మార్చి కాలంలో మార్చి త్రైమాసికంలో భారత ఆర్థిక వృద్ధి రేటు 7.8 శాతం నమోదైంది.దీంతో వార్షిక వృద్ధిరేటు 8.2 శాతానికి పెరిగింది. డిసెంబర్ త్రైమాసికంలో నమోదైన 8.6 శాతం కన్నా తక్కువగా ఉన్నప్పటికీ, గతేడాది(2022-23) ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలంతో(జనవరి-మార్చి)తో పోలిస్తే మెరుగైన ఫలితాలు నమోదయ్యాయి.