Waqf Bill: వక్ఫ్ బిల్లుపై ‘‘జేపీసీ’’ ఏర్పాటు.. డీకే అరుణ, ఓవైసీలకు చోటు..
- వక్ఫ్ సవరణ బిల్లుపై జేపీసీ ఏర్పాటు..
- కమిటీలో డీకే అరుణ.. ఓవైసీలకు చోటు..
- కమిటీలో మొత్తం 21 మంది సభ్యులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Waqf Bill: వక్ఫ్ బోర్డు ‘అపరిమిత అధికారాలకు’ చెక్ పెట్టేందుకు కేంద్రం వక్ఫ్ సవరణ బిల్లును గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. అయితే, ఈ బిల్లును కాంగ్రెస్‌తో పాటు దాని మిత్రపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళన నిర్వహించాయి. ఈ బిల్లు రాజ్యంగ వ్యతిరేకమని, మైనారిటీల హక్కుల్ని ఉల్లంఘిస్తుందని ఆరోపించింది. విపక్షాల ఆరోపణల నేపథ్యం కేంద్రం ఈ బిల్లును సమగ్రంగా చర్చించేందుకు ‘‘జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)’’కి పంపనున్నట్లు వెల్లడించింది.
ఈమేరకు వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై ప్రభుత్వం జేపీనిని ఏర్పాటు చేసింది. జేపీసీ కోసం అధికార, ప్రతిపక్షాలకు చెందిన 21 మంది ఎంపీల పేర్లను కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ప్రతిపాదించారు. ఈ కమిటీలో బీజేపీకి చెందిన మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణతో పాటు ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి చోటు దక్కింది. కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్‌తో పాటు ఎంపీలు ఇమ్రాన్ మసూద్, కృష్ణ దేవరాయులు, మహ్మద్ జావేద్, కళ్యాణ్ బెనర్జీ, జగదాంబికా పాల్, నిషికాంత్ దూబే, తేజస్వి సూర్య, దిలీప్ సైకియా, ఎ రాజా, దిలేశ్వర్ కమైత్, అరవింద్ సావంత్, నరేష్ మాస్కే, అరుణ్ భారతి, అపరాజిత సారంగి, సంజయ్ జైస్వాల్, అభిజిత్ గంగోపాధ్యాయ, మౌలానా మొహిబుల్లా నద్వీ, సురేష్ గోపీనాథ్ సభ్యులుగా ఉన్నారు. జేపీసీ కోసం మరో 10 రాజ్యసభ సభ్యుల పేర్లను సిఫారసు చేయాలని రాజ్యసభను కూడా కోరారు.
Also Read
- CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
- INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
- PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
Read Also: CM Revanth Reddy: అమెరికా పర్యటనలో సీఎం బిజీబిజీ.. అడోబ్ సిస్టమ్స్ సీఈవోతో భేటీ
కేంద్రం రాష్ట్ర వక్ఫ్ బోర్డుల అపరిమిత అధికారాలను కట్టడి చేయడంతో పాటు వక్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్, సర్వే, ఆక్రమణల తొలగింపుకు సంబంధించిన సమస్యల్ని పరిష్కరించడం ఈ చట్టం యొక్క లక్ష్యం. 1995 వక్ఫ్ చట్టంలోని 44 సెక్షన్‌ని సవరించాలని చట్టం ప్రతిపాదించింది. సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ మరియు రాష్ట్ర వక్ఫ్ బోర్డులలో ఇద్దరు మహిళలు తప్పనిసరిగా ఉండాలని బిల్లు ప్రతిపాదిస్తుంది. వక్ఫ్ బోర్డు ద్వారా వచ్చే డబ్బును ప్రభుత్వం సూచించిన పద్ధతిలో వితంతువులు, విడాకులు తీసుకున్నవారు మరియు అనాథల సంక్షేమానికి ఉపయోగించాలని కూడా నిర్దేశించింది. మహిళల వారసత్వ సంపదకు రక్షణ కల్పించాలన్నది మరో కీలక ప్రతిపాదన. వక్ఫ్ సంస్థల్లో ముస్లిమేతర సభ్యులను చేర్చాలనే నిబంధన ప్రతిపాదిత చట్టంలోని మరో వివాదాస్పద అంశం.
ఇదిలా ఉంటే, లోక్‌సభలో బిల్లుపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ.. ఇది కఠినమైన చట్టమని, మతస్వేచ్ఛ, సమాఖ్య వ్యవస్థపై దాడి అని అన్నారు. వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులను నియమించడాన్ని ఆయన వ్యతిరేకించారు. ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ కూడా ఈ బిల్లుని వ్యతిరేకించింది. ఈ బిల్లును బాగా ఆలోచించి రాజకీయాల్లో భాగంగా ప్రవేశపెట్టారని విమర్శించింది. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ.. ‘‘ ఈ బిల్లు ఏ మత సంస్థ స్వేచ్ఛని హరించదు. ఎవరి హక్కుల్ని హరించదు. ఎవరైతే ఇప్పటి వరకు హక్కులు పొందలేదో వారికి హక్కుల్ని కల్పిస్తుంది’’అని అన్నారు. ఈ రోజు తీసుకువచ్చిన ఈ బిల్లును కాంగ్రెస్ హయాంతో సచార్ కమిటీ నివేదిక ఆధారంగా రూపొందించామని అన్నారు.
తాజావార్తలు
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!