భారత్‌లో చమురు ధరలు రోజురోజుకూ విపరీతంగా పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు సెంచరీ దాటేశారు. ఇక డీజిల్ సైతం సెంచరీ వైపుగా పరుగెడుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల ప్రాతిపదికన ఇంధన రిటైల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తూ వస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే ధరలు ఒక రోజు పెరగొచ్చు. మరో రోజు తగ్గొచ్చు. లేదంటే స్థిరంగా కూడా కొనసాగవచ్చు.
అయితే అదే జాబితాలో గ్యాస్ సిలిండర్ ధరలు కూడా చేరనున్నట్లు తెలుస్తోంది. ఇంట్లో వాడే ఎల్పీజీ సిలిండర్ ధరలు జులై 1న మారనున్నాయి. ఎల్పీజీ సిలిండర్ ధరలను ప్రతి 15 రోజులకోసారి పెట్రోలియం కంపెనీలు సవరిస్తుంటాయి. ఆ లెక్కన జులై 1న సిలిండర్ ధరలు మారాల్సి ఉంది. గత కొద్దిరోజలుగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ వస్తున్న ఆయిల్ కంపెనీలు.. సిలిండర్ ధరల విషయంలో కూడా హెచ్చుతగ్గులు వుండే అవకాశం కనిపిస్తోంది.