Thiruvananthapuram: కేరళ రాజధాని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఫుల్ ఎమర్జెన్సీని విధించారు అధికారులు. కాలికట్ నుంచి సౌదీ అరేబియాలోని డమ్మామ్ వెళ్లాల్సిన విమానంలో హైడ్రాలిక్ వైఫల్యం తలెత్తినట్లు తెలుస్తోంది. దీంతో ఈ విమానాన్ని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి డైవర్ట్ చేశారు. 182 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ఐఎక్స్ 385 విమానం శుక్రవారం ఉదయం కాలికట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టును నుంచి టేకాఫ్ అయ్యే సమయంలో రన్ వేను ఢీకొట్టింది. టేకాఫ్ అయ్యే సమయంలో విమానం తోకభాగం రన్ వేను బలంగా ఢీకొట్టింది. దీంతో హైడ్రాలిక్ సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది.
Read Also: PM Narendra Modi: ఈశాన్య రాష్ట్రాలను కాంగ్రెస్ ఏటీఎంగా వాడుకుంది.
ఇదిలా ఉంటే తిరువనంతపురానికి మళ్లించిన విమానం, ఎలాంటి ప్రమాదం జరగకుండా నిండుగా ఉన్న ఇంధనాన్ని అరేబియా సముద్రంలో డంప్ చేశారు. దీని తర్వాత సురక్షితంగా మధ్యాహ్నం 12.15 గంటలకు విమానం ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయింది. దీంతో అధికారులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. దీని కారణంగానే ఎయిర్ పోర్టు యాజమాన్యం విమానం ల్యాండ్ అయ్యేంత వరకు పూర్తి ఎమర్జెన్సీ ప్రకటించింది.
అంతకుముందు అమెరికా నెవార్క్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిరిండియా విమానంలో ఆయిల్ లీకేజీ కారణంగా స్వీడన్ లోని స్టాక్ హోమ్ లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. విమానం రెండో ఇంజిన్ లో ఆయిల్ లీకేజీని గుర్తించారు. 300 మంది ప్రయాణికలు ఉన్న విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు పైలెట్లు.