Rajasthan: రాజస్థాన్‌లో దారుణం.. విద్యుదాఘాతంతో నలుగురు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajasthan: రాజస్థాన్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా విద్యుత్ షాక్‌తో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు మరణించారు. ఈ హృదయ విదారక ఘటన రాజస్థాన్ లో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళ్తే.. గురువారం రాత్రి రాజస్థాన్ రాష్ట్రం లోని సలాంబర్ జిల్లా లోని లసాదియా ప్రాంతంలో విద్యుత్ షాక్‌తో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. ఇది గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటీన ఘటన స్థలానికి చేరుకొని మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
Also Read
- Mohali Office Murder: ఆ కారణంతోనే చంపాడు.. మొహాలి ఘటన చెప్పిన చేదు నిజం!
- NEET UG 2026: నీట్ రీ-ఎగ్జామ్ కు ముందు.. పేపర్ లీక్ వదంతులపై విద్యార్థులకు ఎన్టీఏ విజ్ఞప్తి..
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
ఈ నేపథ్యంలో సలాంబర్ డీఎస్పీ దుంగార్సింగ్ మాట్లాడుతూ.. బోడ్ ఫల్లాలో నివాసముంటున్న ఉంకర్ మీనా ఇంట్లో విషాదం నెలకొందని.. ఇంటి సమీపం లోని విద్యుత్ స్తంభంలో షార్ట్ సర్క్యూట్ సంభవించిందని.. అది ఇంటి ఇనుప గేటు వైర్‌కు తాకిందని.. దీనితో 68 ఏళ్ల ఉంకర్ మీనా , అతని భార్య భన్వారీ (65) కూడా విద్యుదాఘాతానికి గురైయ్యారని, తల్లిదండ్రులను రక్షించడానికి ప్రయత్నించిన అతని 25 ఏళ్ల కుమారుడు దేవి లాల్ అలానే అతని 22 ఏళ్ల (వివాహిత) కుమార్తె కూడా విద్యుదాఘాతానికి గురయ్యారని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్ షాక్‌తో నలుగురు మృతి
చెందినట్లు ఆయన తెలిపారు.
Read also:Semifinal CWC 2023: వన్డే ప్రపంచకప్ 2023.. భారత్ సెమీస్ ప్రత్యర్థి ఎవరంటే?
కాగా ఈ ఈ ఘటనపై ఇరుగుపొరుగు వారు అతనికి సమాచారం అందించారని. అనంతరం పోలీసులకు, జిల్లా యంత్రాంగానికి సమాచారం అందించామని, నలుగురి మృతదేహాలను ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచామని తెలిపిన ఆయన..శుక్రవారం పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగింస్తామని తెలిపారు. కాగా కూన్ పోలీస్ అధికారి ప్రవీణ్ సింగ్ శక్తావత్ తన సిబ్బందితో సంఘటనా స్థలాన్ని సందర్శించి విచారణ చేపట్టారు. అలానే సలాంబర్ జిల్లా మెజిస్ట్రేట్ ప్రతాప్ సింగ్ కూడా సంఘటనా స్థలానికి చేరుకుని ఘటన గురించి సమాచారం అందుకున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి కన్హయ్యలాల్ మీనా, స్థానిక సర్పంచ్ పూంచ్ చాంద్ మీనా కూడా ఘటన స్థలాన్ని సందర్శించారు.
తాజావార్తలు
-
Rajat Patidar: రెండు ఐపీఎల్ టైటిల్స్, 500 రన్స్.. పాటిదార్ ఎంపిక కాకపోవడంపై అగార్కర్ కీలక వ్యాఖ్యలు!
-
Peddi Controversy : హీరోయిన్లను బ్లేమ్ చేయకండి… చేసేదంతా దర్శకులే… ‘పెద్ది’ వివాదంపై నాగ్ హీరోయిన్ రియాక్షన్
-
NTRNEEL : ఎన్టీఆర్ ‘డ్రాగన్’ షూటింగ్.. ఈసారి లంకని తగలబెట్టబోతున్న నీల్
-
Polavaram Tiger: పోలవరం ఊపిరి పీల్చుకో.. డ్రోన్ కెమెరాలకు చిక్కిన పెద్దపులి!
-
7 Seater Cars: మారుతి ఎర్టిగా నుంచి మహీంద్రా బొలెరో వరకు.. రూ.5.65 లక్షల నుంచి లభించే చౌకైన 7-సీటర్ కార్లు ఇవే
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!