Pakistan: ఇమ్రాన్ ఖాన్ వల్ల భారత్‌తో సంబంధాలు క్షీణించాయి..
- మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వల్ల భారత్‌తో సంబంధాలు క్షీణించాయి..
- ప్రధాని మోడీపై ఇమ్రాన్ చేసిన వ్యాఖ్యల వల్లే ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి..
- భారత్- పాక్ మధ్య సంబంధాలను మెరుగుపరిచేందుకు వారధి పాత్రను పోషిస్తా: నవాజ్ షరీఫ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ భారత్‌తో మెరుగైన సంబంధాలను ఏర్పాటు చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. భారత్‌తో సంబంధాలను చెడగొట్టడంలో ఇమ్రాన్ కీలక పాత్ర పోషించారని ఆయన ఆరోపించారు. భారత ప్రధాని మోడీపై ఇమ్రాన్ ఖాన్ పలు వ్యాఖ్యలు చేయడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. ఇరు దేశాల గురించి అసత్య ప్రచారం చేయడం మానేద్దామని నవాజ్ షరీఫ్ పిలుపునిచ్చారు.
Also Read
- PM Modi’s Message to Gen Z: రీల్స్, ఇన్ఫ్లుయెన్సర్ల మాయలో పడొద్దు.. షార్ట్కట్లు వద్దు.. జెన్-జెడ్‌కు మోడీ సందేశం
- Ram Nath Kovind Autobiography: సామాన్య కుటుంబం నుంచి రాష్ట్రపతి వరకు.. కోవింద్ జీవితంఆదర్శం-ప్రధాని మోడీ
- Explainer: రెస్టారెంట్ కిచెన్‌లో బొద్దింకల కాపురం..ఈగల సంసారం.. మీరు తింటున్నది ఇదే!
- Jharkhand Student Protest: జార్ఖండ్‌లో ఉద్రిక్తంగా మారిన నిరుద్యోగుల పోరు.. అర్ధరాత్రి పోలీసులు ఎందుకు వచ్చారు?
అయితే, భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ప్రస్తుత పాకిస్థాన్ పర్యటన పట్ల నవాజ్ షరీఫ్ చాలా ఆనందం వ్యక్తం చేశారు. రెండు దేశాల మధ్య సమస్యలపై ఇరుపక్షాలు కూర్చొని మాట్లాడుకోవాలని నవాజ్ అన్నారు. 2015లో లాహోర్‌కు ప్రధాని మోడీ అకస్మాత్తుగా రాకను కూడా గుర్తు చేశారు. పాత విషయాలను మరచిపోయి.. కొత్తగా ఇరు దేశాల మధ్య సంబంధాలను ప్రారంభించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. అలాగే, ఇండియా- పాకిస్థాన్ దేశాల మధ్య క్రికెట్, వాణిజ్యం పునరుద్ధరణ జరగాలని ఆయన తెలిపారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరిచేందుకు వారధి పాత్రను పోషించేందుకు నేను సిద్ధంగా ఉన్నానని నవాజ్ షరీఫ్ అన్నారు.
Read Also: Yahya Sinwar: హమాస్ చీఫ్ సిన్వర్ చివరి క్షణాలు.. నెట్టింట వీడియో వైరల్
అయితే, భారత్-పాక్ స్నేహపూర్వకంగా కలిసి ఉండాలని మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ అన్నారు. దాదాపు 70 ఏళ్లు పోరాటం చేశాం.. దీన్ని మరో 70 ఏళ్లు ముందుకు తీసుకెళ్లకూడదని కోరారు. ఇరు దేశాలు కూర్చుని చర్చించుకుని సానుకూలంగా ముందుకు కొనసాగాలన్నారు. పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత్- పాక్ మధ్య వాణిజ్యం నిలిచిపోవడం గమనార్హం. ఇప్పటి వరకు ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరగలేదు. ఇక, భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సదస్సులో పాల్గొనేందుకు అక్టోబర్ 15న పాకిస్థాన్ వెళ్లారు. తొమ్మిదేళ్ల తర్వాత భారత విదేశాంగ మంత్రి పాకిస్థాన్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. దివంగత కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ చివరిసారి పాకిస్థాన్‌లో పర్యటించారు.
తాజావార్తలు
-
Banded Krait Snake: వరంగల్ జిల్లాలో డేంజరస్ స్నేక్.. ‘బాండెడ్ క్రైట్’గా గుర్తించిన అటవీ అధికారులు!
-
PM Modi’s Message to Gen Z: రీల్స్, ఇన్ఫ్లుయెన్సర్ల మాయలో పడొద్దు.. షార్ట్కట్లు వద్దు.. జెన్-జెడ్‌కు మోడీ సందేశం
-
Independence Day Special: దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరుల కథలు… ఇండిపెండెన్స్ డేకి మస్ట్ వాచ్ సినిమాలు!
-
HCU Drugs: హెచ్‌సీయూలో గంజాయి కలకలం.. 17 మంది విద్యార్థులకు పాజిటివ్!
-
Hardik Pandya: “కెప్టెన్సీ ఇస్తేనే వస్తా”.. గుజరాత్ ఫ్రాంచైజీకి హార్దిక్ పాండ్యా షాక్..
ట్రెండింగ్
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!