NTV Telugu Site icon

Pakistan: ఇమ్రాన్ ఖాన్ వల్ల భారత్‌తో సంబంధాలు క్షీణించాయి..

Ind Vs Pak

Ind Vs Pak

Pakistan: పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ భారత్‌తో మెరుగైన సంబంధాలను ఏర్పాటు చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. భారత్‌తో సంబంధాలను చెడగొట్టడంలో ఇమ్రాన్ కీలక పాత్ర పోషించారని ఆయన ఆరోపించారు. భారత ప్రధాని మోడీపై ఇమ్రాన్ ఖాన్ పలు వ్యాఖ్యలు చేయడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. ఇరు దేశాల గురించి అసత్య ప్రచారం చేయడం మానేద్దామని నవాజ్ షరీఫ్ పిలుపునిచ్చారు.

Read Also: Redmi A4 5G Price: క్రేజీ ఫీచర్స్, బిగ్ బ్యాటరీ.. 10 వేలకే రెడ్‌మీ 5జీ ఫోన్‌! ఫస్ట్ స్మార్ట్‌ఫోన్‌ ఇదే

అయితే, భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ప్రస్తుత పాకిస్థాన్ పర్యటన పట్ల నవాజ్ షరీఫ్ చాలా ఆనందం వ్యక్తం చేశారు. రెండు దేశాల మధ్య సమస్యలపై ఇరుపక్షాలు కూర్చొని మాట్లాడుకోవాలని నవాజ్ అన్నారు. 2015లో లాహోర్‌కు ప్రధాని మోడీ అకస్మాత్తుగా రాకను కూడా గుర్తు చేశారు. పాత విషయాలను మరచిపోయి.. కొత్తగా ఇరు దేశాల మధ్య సంబంధాలను ప్రారంభించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. అలాగే, ఇండియా- పాకిస్థాన్ దేశాల మధ్య క్రికెట్, వాణిజ్యం పునరుద్ధరణ జరగాలని ఆయన తెలిపారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరిచేందుకు వారధి పాత్రను పోషించేందుకు నేను సిద్ధంగా ఉన్నానని నవాజ్ షరీఫ్ అన్నారు.

Read Also: Yahya Sinwar: హమాస్‌ చీఫ్ సిన్వర్‌ చివరి క్షణాలు.. నెట్టింట వీడియో వైరల్

అయితే, భారత్-పాక్ స్నేహపూర్వకంగా కలిసి ఉండాలని మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ అన్నారు. దాదాపు 70 ఏళ్లు పోరాటం చేశాం.. దీన్ని మరో 70 ఏళ్లు ముందుకు తీసుకెళ్లకూడదని కోరారు. ఇరు దేశాలు కూర్చుని చర్చించుకుని సానుకూలంగా ముందుకు కొనసాగాలన్నారు. పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత్- పాక్ మధ్య వాణిజ్యం నిలిచిపోవడం గమనార్హం. ఇప్పటి వరకు ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరగలేదు. ఇక, భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సదస్సులో పాల్గొనేందుకు అక్టోబర్ 15న పాకిస్థాన్ వెళ్లారు. తొమ్మిదేళ్ల తర్వాత భారత విదేశాంగ మంత్రి పాకిస్థాన్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. దివంగత కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ చివరిసారి పాకిస్థాన్‌లో పర్యటించారు.

Show comments