Ragging: ర్యాగింగ్ భూతానికి 15 ఏళ్ల బాలుడు బలయ్యాడదు. కేరళలోని టీనేజర్ మిహిర్ ఆత్మహత్య సంచలనంగా మారింది. స్కూల్‌లో ర్యాగింగ్, బెదిరింపులతో ప్రాణం తీసుకున్నాడు. కేరళలోని ఎర్నాకుళంలోని త్రిప్పునితురలో జనవరి 15న మిహిర్ తన అపార్ట్‌మెంట్ భవనంలోని 26వ అంతస్తు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన కుమారుడు ఎదుర్కొన్న భయంకరమైన అనుభవాలను అతడి తల్లి రజ్నా పీఎం సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.