Bengaluru: నగ్న చిత్రాలను షేర్ చేసిన డాక్టర్‌ని హత్య చేసిన ప్రియురాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Doctor killed by fiance in Bengaluru: ప్రేమ పేరుతో వంచించిన ప్రియుడిని హతమార్చింది ఓ యువతి. తన నగ్న చిత్రాలను సోషల్ మీడియా షేర్ చేసిందుకు ప్రియుడిని స్నేహితులతో కలిసి చంపేసింది. డాక్టరైన ప్రియుడు తన ప్రియురాలికి తెలియకుండా సోషల్ మీడియాలో ఆమె న్యూడ్ ఫోటోలను షేర్ చేశాడు. దీన్ని గమనించిన ప్రియురాలు అతడిపై దాడి చేసింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి సెప్టెంబర్ 14న మరణించాడు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. బెంగళూర్ లో డాక్టర్ వికాష్(27), ప్రతిప అనే అమ్మాయి ప్రేమించుకుంటున్నారు. ఉక్రెయిన్ లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన వికాష్.. ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎగ్జామినేషన్ (ఎఫ్‌ఎంజీఈ)కి కోచింగ్ తీసుకునేందుకు నాలుగు నెలల క్రితం బెంగళూరు వెళ్లాడు. రెండేళ్లుగా ప్రతిపతో ప్రేమాయణం నడుపుతున్నాడు వికాస్. వీరిద్దరికి నిశ్చితార్థం కూడా జరిగింది. అయితే ప్రతిపకు తెలియకుండా వికాష్ ఆమె న్యూడ్ ఫోటోలను తీసి.. తన ఫ్రెండ్ పేరుతో సోషల్ మీడియాలో ఖాతా తెరిచి అందులో ప్రతిప న్యూడ్ ఫోటోలను షేర్ చేశాడు. ఇదే కాకుండా తమిళనాడులోని తన స్నేహితులకు ఈ ఫోటోలను షేర్ చేశాడు.
Also Read
- IndiGo 6E925 Lightning Strike: 17,000 అడుగుల ఎత్తులో ఇండిగో విమానంపై పిడుగు.. 104 మంది ప్రయాణికులు..
- Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
Read Also: Subbulakshmi Jagadeesan: సీఎం స్టాలిన్‌కు షాక్.. పార్టీకి రాజీనామా చేసిన కీలక నేత
ఈ న్యూడ్ ఫోటోలను సెప్టెంబర్ 8న గమనించిన ప్రతిప.. వికాష్ ను నిలదీయగా..వినోదం కోసం చేశానని చెప్పాడు. దీనిపై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ విషయాన్ని ప్రతిప తన క్లాస్‌మేట్ అయిన సుశీల్‌కి విషయాన్ని తెలపగా.. వికాష్ కు బుద్ధి చెప్పాలని మరో ఇద్దరు నిందితులు గౌతమ్, సూర్యలతో కలిసి దాడి చేశారు. ఈ నెల 10న మైకో లేఅవుట్ లోని సువీల్ ఇంటికి వికాష్ ను తీసుకెళ్లింది ప్రతిప. పథకం ప్రకారం నిందితులంతా కలిసి అతనిపై దాడి చేశారు. అయితే వికాష్ ను చంపే ఉద్దేశం లేకపోవడంతో దాడి చేసిన తర్వాత అతన్ని ఆస్పత్రిలో చేర్పించారు.
తన నగ్న చిత్రాలను సోషల్ మీడియాలో షేర్ చేశాడని గుర్తించిన ఓ మహిళ, ఆమె ముగ్గురు స్నేహితులు బెంగుళూరులో తన డాక్టర్-ప్రియుడిపై దాడి చేశారు. చికిత్స పొందుతూ సెప్టెంబర్ 14న మృతి చెందాడు. ప్రతిపతో పాటు ఆమె ఇద్దరు స్నేహితులు సుశీల్, గౌతమ్ లను పోలీసులు అరెస్ట్ చేయగా.. మరో నిందితుడు సూర్య పరారీలో ఉన్నాడు. నిందితులపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Nana Patekar: “రియల్ హీరో”.. సైనికులతో కలిసి కార్గిల్‌లో 60 రోజులు యుద్ధం చేసిన నానా పటేకర్..
-
Kieron Pollard: ముంబై ఇండియన్స్‌కు షాక్.. ప్రత్యర్థి జట్టులోకి కీరన్ పొలార్డ్!
-
Nara Lokesh: డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం సమిష్టిగా ముందుకు..
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Starlink India Row: ‘మార్కెట్ గుత్తాధిపత్యం కోసమే అడ్డుకుంటున్నారు’.. Starlink Indiaపై ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!