Fire breaks out in Delhi and Pune:దేశ రాజధాని ఢిల్లీతో పాటు పూణే నగరాల్లో మంగళవారం అగ్నిప్రమాదాలు సంభవించాయి. రెండు ప్రమాదాల్లో ప్రాణ నష్ణం సంభవించలేదు. పెద్ద ఎత్తున ఆస్తినష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. పూణేలోని లుల్లా నగర్ ప్రాంతంలోని ఓ వాణిజ్య భవనంలోని ఏడో అంతస్తులో ఉన్న ఓ రెస్టారెంట్ లో మంగళవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మార్వెల్ విస్టా కమర్షియర్ భవనంలోని ఏడో అంతస్తులో ఉన్న వెజిటా రెస్టారెంట్ లో ఉదయం 8.15 గంటలకు మంటలు చెలరేగాయి. మంటలను అదుపులోకి తెచ్చేందుకు మూడు ఫైరింజన్లు, రెండు వాటర్ ట్యాంకర్లను రంగంలోకి దింపింది పూణే ఫైర్ డిపార్ట్మెంట్. గంట పాటు కష్టపడి ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపోలోకి తీసుకువచ్చిందని ఫైర్ స్టేషన్ ఆఫీసర్ సమీర్ షేక్ తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో రెస్టారెంట్ మూసి ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పింది.
Read Also: Go Back Modi: ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతున్న “గో బ్యాక్ మోదీ”
మరోవైపు ఢిల్లీలో కూడా అగ్నిప్రమాదం సంభవించింది. నరేలా ఇండస్ట్రియల్ ఏరియాలో మంటలు చెలరేగడంతో 10 ఫైర్ ఇంజన్లు మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటి వరకు ముగ్గురిని అగ్నిమాపక సిబ్బంది కాపాడింది. మరికొంత మంది మంటల్లో చిక్కుకుపోయారని భావిస్తున్నారు. నరేలాలోని ఇండస్ట్రియల్ ఎస్టేట్ ప్రాంతంలోని ఓ చెప్పుల ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఇప్పటి వరకు ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు. మరికొంత మంది స్వల్పగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చనిపోయిన వారిని గుర్తించేందుకు ఢిల్లీ పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
Delhi | Fire breaks out in Narela Industrial Area, 10 fire tenders rushed to the spot. Three people have been rescued so far, a few people feared trapped. Rescue operation underway: Delhi Fire Service pic.twitter.com/PTh0ksEUDq
— ANI (@ANI) November 1, 2022