JDS: బీజేపీతో జేడీఎస్ పొత్తు.. కీలక ముస్లిం నేత రాజీనామా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JDS: కర్ణాటకలో పాత మిత్రుడితో మళ్లీ జేడీఎస్ జతకట్టింది. బీజేపీ, జేడీఎస్ మధ్య పొత్తు కుదరింది. రెండు రోజుల క్రితం జనతాదళ్ సెక్యులర్(జేడీఎస్), బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో చేరింది. మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, అతని కుమారుడు నిఖిల్ గౌడ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో ఎన్డీయేలో చేరారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత జేడీఎస్, బీజేపీల మధ్య పొత్తు చిగురించింది. రెండు పార్టీలు కలిసికట్టుగా 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి.
Read Also: Vandebharat Express: మరో 9 వందే భారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని.. తెలుగు రాష్ట్రాలకు రెండు రైళ్లు
Also Read
- UPI MDR Charges: వ్యాపారులకు బిగ్ రిలీఫ్.. రూ.2,000 దాటితే పడే ఛార్జీలపై బ్రేక్..
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం క్లారిటీ.. ఎప్పటి నుంచి అమల్లోకి అంటే..!
- Maharashtra: మహారాష్ట్రలో వాటర్ ఎమర్జెన్సీ.. నీళ్లు వృథా చేస్తే రూ.5 వేల జరిమానా, కేసులు!
- Rahul Gandhi: పరువు నష్టం కేసు.. సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్..
ఇదిలా ఉంటే జేడీఎస్, బీజేపీతో పొత్తు పెట్టుకోవడంపై ఆ పార్టీలోని కొందరు ముస్లిం నాయకులు అయిష్టంగా ఉన్నారు. తాజాగా ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తాకింది. పార్టీ సీనియర్ నేత, కర్ణాటకలో జేడీఎస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సయ్యద్ షైఫుల్లా ఆ పార్టీకి రాజీనామా చేశారు. మతాలు, కులాల మధ్య చీలిక తీసుకువచ్చే పార్టీలో జేడీఎస్ చేరిందని, గత 30 ఏళ్లుగా జేడీఎస్ లో ఉన్నానని, మా పార్టీ ఓటర్లకు, సామాన్య ప్రజలకు సెక్యులర్ సిద్ధాంతాలను ప్రచారం చేసిందని, ఇప్పుడు బీజేపీతో చేరుతుంటే దాన్ని వ్యతిరేకిస్తున్నానని ఆయన అన్నారు.
మనం దేశాన్ని అభివృద్ధి చేయాల్సిన మార్గం ఇది కాదని, ప్రజల మధ్య చిచ్చు పెట్టే బీజేపీతో లౌకిక శక్తులు ఏకీభవించడం లేదని షైఫుల్లా అన్నారు. ఇక పార్టీలో సర్దుపోవడం తనకు కష్టమని అందుకే రాజనీమా చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. దేశంలో ద్వేషాన్ని ప్రచారం చేసే వారితో సర్దుకుపోవడం కష్టమని అన్నారు.
- Tags
- bjp
- JDS
- jds-bjp alliance
- karnataka
- NDA
తాజావార్తలు
-
Sumo Didi: ఒళ్ళు గగుర్పొడిచేలా ‘సుమో దీదీ’ ట్రైలర్!
-
AP High Court-YCP: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ.. రెండు పిటిషన్లు దాఖలు!
-
UPI MDR Charges: వ్యాపారులకు బిగ్ రిలీఫ్.. రూ.2,000 దాటితే పడే ఛార్జీలపై బ్రేక్..
-
Ranabaali Censor Report: వివాదాస్పద అంశాలున్నా ‘రణబాలి’కి సింగిల్ కట్ లేకుండా U/A!
-
CWC27 Ticket Ballot: టికెట్ బ్యాలెట్ ప్రక్రియకు అనూహ్య స్పందన.. 142 దేశాల నుంచి 1.50 కోట్ల దరఖాస్తులు..
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!