Fake Lawyer Arrested In Tamilnadu Who Came To Meet Prisoner In Puzhal Central Jail: తమ ఖైదీలను కలిసేందుకు లాయర్లు సాధారణంగా జైళ్లకు వెళ్తుంటారు. అలాగే తమిళనాడులోనూ ఓ లాయర్ తన ఖైదీని చూసేందుకు వెళ్లగా.. అతడు అరెస్ట్ అయ్యాడు. ఎందుకు? అని అనుకుంటున్నారా! ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. చైన్నె సెంట్రల్ పుళల్‌లో సుమారు 3 వేల మందికి పైగా ఖైదీలు ఉన్నారు. వీరిని కలిసేందుకు.. న్యాయవాదులు తరచూ వచ్చి వెళ్తుంటారు. ఈ క్రమంలోనే శుక్రవారం సాయంత్రం సతీష్ కుమార్ (38) అనే లాయర్ తన ఖైదీని చూడ్డానికి వచ్చాడు. అయితే.. అతడు మాట్లాడిన తీరు, నడవడికల్ని చూసి, జైలర్‌కు అనుమానం వచ్చింది. లాయర్ లక్షణాలేమీ అతనిలో కనిపించలేదు.
Suryakumar Yadav: రెండుసార్లు గోల్డెన్ డక్.. సూర్యని తీసేసి, అతడ్ని తీసుకోండి
దీంతో.. జైలర్ అతడ్ని తన గుర్తింపు కార్డు చూపించమని కోరాడు. అతడు తన కార్డు తీసి చూపించాడు. అంతేకాదు.. కాస్త దురుసుగా కూడా ప్రవర్తించాడు. ఒక లాయర్‌తో ఇలాగేనా బిహేవ్ చేసేదంటూ జైలర్‌తో వాగ్వాదానికి దిగాడు. ఇంతలో ఆ కార్డు నకిలీది అని, అతడు అసలు న్యాయవాది కాదని తేలింది. దీంతో.. జైలు అధికారులు వెంటనే అతడ్ని అదుపులోకి తీసుకొని, పుళల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అతడ్ని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆ వ్యక్తి ఎవరు? ఎందుకు లాయర్ గెటప్‌లో ఆ జైలుకు వెళ్లాడు? అనే కోణాల్లో దర్యాప్తు చేశారు. ఈ నేపథ్యంలోనే ఓ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. 2013లో తిరువేర్కాడులో జరిగిన హత్య కేసులో సతీష్ కుమార్‌కి ప్రమేయం ఉందని తెలిసింది.
Raashi Khanna: ఒక్క హిట్ వచ్చిందో లేదో.. విప్పి చూపించడం ఎక్కువైందిగా
ఇంకేముంది.. సతీష్ ఓ నిందితుడు అని తేలడంతో, పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద ఉన్న నకిలీ న్యాయవాది ఐడీ కార్డును స్వాధీనం చేసుకున్నారు. న్యాయవాది పేరుతో అతడు ఇంకా ఎక్కడెక్కడ మోసాలకు పాల్పడ్డాడు? అసలు అతని ఉద్దేశం ఏమిటి? అనే కోణాల్లో విచారిస్తున్నారు. అతడ్ని కోర్టులో హాజరుపరిచి.. పుళల్ జైలుకి తరలించారు. ఇతని ఉదంతంతో.. చెన్నై సెంట్రల్ పుళల్‌లో మరింత భద్రత పెంచారు.