PM Modi: పాకిస్తాన్లో పేలుళ్లతో కాంగ్రెస్ రాజకుటుంబానికి నిద్ర కరువు..
- పాకిస్తాన్ పేలుళ్లతో కాంగ్రెస్ రాజకుటుంబానికి నిద్ర కరువు..
- గాంధీలపై తీవ్ర విమర్శలు చేసిన ప్రధాని మోడీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi:ఆపరేషన్ సిందూర్ విజయం తర్వాత దేశం తన సైన్యాన్ని చూసి గర్వపడిందని, కానీ కాంగ్రెస్-ఆర్జేడీ దానిని ఇష్టపడటం లేదని ఆదివారం ప్రధాని నరేంద్రమోడీ విమర్శించారు. బీహార్‌లోని అర్రాలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆయన.. రెండు పార్టీలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘పాకిస్తాన్లో పేలుళ్లు జరిగితే, కాంగ్రెస్ రాజకుటుంబం నిద్ర కోల్పోతోంది. ఆపరేషన్ సిందూర్ షాక్ నుంచి పాకిస్తాన్, కాంగ్రెస్ కోలుకోలేదు’’ అని గాంధీ కుటుంబాన్ని తీవ్రంగా విమర్శించారు.
Read Also: Andhra-King-Taluka : షూటింగ్ కంప్లీట్ – ప్రమోషన్లు స్టార్ట్..!
Also Read
విక్షిత్ భారత్ (అభివృద్ధి చెందిన భారతదేశం) ప్రతిజ్ఞతో ఎన్డీఏ ముందుకు సాగుతోంది. మరోవైపు, కాంగ్రెస్,ఆర్జేడీ ఘర్షణ పడుతున్నాయని అన్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఒక రోజు ముందు బీహార్‌లో మూసిన తలుపుల వెనక దొంగల ఆట జరిగిందని ప్రధాని ఆరోపించారు. కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆర్జేడీ నేతను పేర్కొనడం కాంగ్రెస్‌కు ఇష్టం లేదని, ఆర్జేడీ కాంగ్రెస్ తలపై తుపాకీ పెట్టి ముఖ్యమంత్రి పదవిని దొంగిలించని ప్రధాని ఆరోపించారు.
ఆర్జేడీ, కాంగ్రెస్ మధ్య గొడవ తీవ్రమైందని, మేనిఫెస్టోపై కాంగ్రెస్‌ను సంప్రదించలేదని, ఎన్నికల ముందు ఇంత ద్వేషం ఉంటే, ఎన్నికల తర్వాత ఒకరి తలలు ఒకరు పగలగొట్టుకుంటారని ఎద్దేవా చేశారు. ఇలాంటి వారు బీహార్ అభివృద్ధికి పనికి రారు అని ప్రధాని అన్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ పాలన జంగిల్ రాజ్ అని, ఎన్డీయే పాలన సుపరిపాలన అని ప్రధాని అన్నారు. నితీష్ కుమార్, ఎన్డీయే ప్రభుత్వం బీహార్‌ను జంగిల్ రాజ్ లాంటి క్లిష్ట కాలం నుంచి బయటకు తీసుకువచ్చిందని ప్రధాని చెప్పారు.
తాజావార్తలు
-
Sahil Chauhan: 27 బంతుల్లో సెంచరీ.. టీ20 క్రికెట్లో ప్రపంచ రికార్డు.. అతడికి ఇండియాతో సంబంధం ఏంటి..?
-
Ravi Teja: హిట్టు పడగానే రేటు పెంచేసిన మాస్ రాజా.. నిర్మాత డ్రాప్.. సంక్రాంతి సినిమా క్యాన్సల్ ?
-
వరంగల్ MGMలో ఒక్కసారిగా కుప్పకూలిన సీలింగ్.. ముగ్గురికి గాయాలు!
-
Hamid Ansari row: ‘‘ దేశానికి హిందువులు ముప్పా.?’’.. హమీద్ అన్సారీ వ్యాఖ్యలపై దుమారం..
-
Vedant Madhavan: ప్రౌడ్ ఫాదర్ మూమెంట్.. ఏషియన్ గేమ్స్ బరిలో మాధవన్ కుమారుడు!
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!